స్త్రీలు పొరపాటున కూడా ఈ పనులు చేయవద్దు..

ప్రతి స్త్రీ జీవితంలో వివాహం అనేది కీలక ఘట్టం. ఒక తెలియని ప్రాంతానికి, పరిస్థితుల మధ్యకు వెళ్లాల్సి వస్తుంది. అయితే పుట్టింటి నుంచి కొన్ని వస్తువులను స్త్రీ పొరపాటున కూడా అత్తవారింటికి తీసుకెళ్లకూడదట. తెలిసీ తెలియక తీసుకెళ్లే వస్తువుల కారణంగా ఇంట్లో కష్టాలతో పాటు భార్యాభర్తల మధ్య సైతం విబేదాలు తలెత్తుతాయట. ఆ వస్తువులేంటో తెలుసుకుందాం. ముందుగా దేవుని విగ్రహం. పుట్టింటి నుంచి పొరపాటున కూడా దేవుని విగ్రహాన్ని అత్తవారింటికి తీసుకెళ్లకూడదు. అలా తీసుకెళ్తే పుట్టింటిని ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయట.

అమ్మాయిలు ఎట్టి పరిస్థితుల్లోనూ కత్తులు, కత్తెరలు, సూదులు వంటి పదునైన వస్తువులను పుట్టింటి నుంచి అత్తారింటికి తీసుకెళ్లకూడదు. ఇలాంటివి తీసుకెళితే ఇంట్లో విభేదాలు తలెత్తి చివరకు భార్యాభర్తలు విడిపోయే పరిస్థితి కూడా రావొచ్చు. వివాహం తర్వాత.. స్త్రీ తన పుట్టింటి నుంచి అత్తారింటికి పదే పదే డబ్బు తీసుకెళ్లకూడదు. అలా చేస్తే అత్తారింట అనేక సమస్యలు తలెత్తి చివరకు ఇల్లే నాశనమవుతుందట. ప్రతి ఇంట్లో మంచి, చెడు రెండూ ఉంటాయి. అయితే పుట్టింట్లో చెడు సంఘటనల గురించి ఎట్టి పరిస్థితుల్లోనూ అత్తవారింట ప్రస్తావించకూడదు. అలా చేస్తే పుట్టింటి వారు లోకువ అవుతారు.

Share this post with your friends