
శంఖం పూరించగానే వచ్చే శబ్దానికి ఆ చుట్టుపక్కల ఉండే క్రిమికీటకాలు నాశనమైపోతాయని చెబుతారు. దీనిని ఆధునిక శాస్త్ర విజ్ఞానం కూడా ధృవీకరించింది. 1929లో బెర్లిన్ యూనివర్సిటీలో దీనిని మళ్లీ నిర్ధారించారు. ఈ శంఖ ధ్వనికి రెండువేల ఆరువందల అడుగుల దూరంలో ఉండే క్రిములు కూడా స్పృహ తప్పి పోతాయట. అంతేకాదు వైద్యశాస్త్రంలో కూడా దీనికి మంచి గుర్తింపు ఉంది. రోజూ శంఖాన్ని ఊదేవారికి శ్వాస సంబందిత వ్యాధులు దగ్గరకి రావట. ఆస్త్మా కూడా తగ్గుతుందని ఒక అధ్యయనం తెలిపింది. రాత్రి పూట శంఖాన్ని నీళ్ళతో నింపి ఆ నీటిని ఉదయాన్నే చర్మంపై రాసుకుంటే చర్మసంబందిత వ్యాధులు దూరమవుతాయట. శంఖం పూరించగానే వచ్చే శబ్దానికి ఆ చుట్టుపక్కల ఉండే క్రిమికీటకాలు నాశనమైపోతాయని నమ్మకం.
ఇంట్లో శంఖాన్ని ఉంచుకోవటం వల్ల వాస్తు దోషాలు ఉన్నా అన్నీ తొలగిపోతాయి. శంఖాన్ని కాల్చగా వచ్చిన భస్మం వల్ల అనేక రోగాలు నయమవుతాయట. ఈ శంఖాల వల్ల ఆయువృద్ధి, లక్ష్మీ ప్రాప్తి, పుత్రప్రాప్తి, శాంతి, వివాహ ప్రాప్తి కలుగుతాయని ఒక నమ్మకం. శంఖాలలో అనేక రకాలు ఉన్నాయి. అందులో గోముఖ శంఖం ఒకటి. ఇది ఆవు మొహం ఆకారంలో ఉండటం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది. గోముఖ శంఖాన్ని పూజించిన వారికి మనస్సులో ఉన్న కోరికలు తీరుతాయి. దీనిని షాపులో ఉంచుకొని పూజించిన వారికి రోజూ వ్యాపార, ధనాభివృద్ది కలుగుతుంది. శంఖం ఏదైనా దానిని మాత్రం ఎప్పుడూ బోర్లించి ఉంచకూడదు. ఏ ఇంట్లో శంఖాన్ని దేవుడి గదిలో ఉంచి పూజిస్తారో ఆ ఇల్లు ధనధాన్యాలతో తులతూగుతుందిట.ఇన్ని ఉపయోగాలున్న శంఖాన్ని పూజించడం, ఆరాదించడం, పూజా విధానాలలో ఉపయోగించడం ఎంతో మంచిది.
భక్తి అంటే మనం భగవంతుడి వద్దకు వెళ్ళడం అనుకుంటాం. కానీ భగవంతుడినే మన వద్దకు రప్పించుకోవడమే అసలైన భక్తి. అయితే నిజంగా దైవం మన వద్దకు వస్తుందా? అసలు దైవానికి కావలసింది ఏమిటి? నిజానికి దైవం ఎవరి నుంచీ ఆశించేది ఏమీ లేదు. భగవంతుడిని పూజించడం, స్మరించడం అనేవి ఎవరిని వారు తరింప చేసుకునేందుకే కాని మనమేదో దేవుడికి గొప్ప ఉపకారం, సేవ చేసామని భావించేందుకు కాదు. నిజానికి డాబు కోసం చేసే దానధర్మాలు వ్యర్ధం. అందుకే గొప్ప గొప్ప ఆలయాలు కట్టినా, దానాలు చేసినా సంతోషించని దైవం నిష్కల్మషమైన మనసుతో చేసే ప్రార్ధనకు కరిగిపోతారు. అలాగని కేవలం పూజలు చేస్తూ ఉంటే దైవం మెచ్చరు. ప్రార్ధించే పెదవుల కన్నా, సేవ చేసే చేతులే మిన్న. ఉన్నంతలో నిస్స్వార్థంతో సేవలు, దానములు చేస్తూ ఆ దైవం మెచ్చే పని మనం చేసినప్పుడు ఆయన తప్పక మనలను వెతుక్కుంటూ వస్తారు. ఇది సత్యం..
