దీపావళి నాడు శనిదేవుడిని ఎందుకు పూజించాలి?

హిందువులు జరుపుకునే ప్రధాన పండుగల్లో దీపావళి ఒకటి. ప్రతి ఏటా ఆశ్వయుజ మాసంలోని అమావాస్య తిథిన మనం దీపావళి పండుగను జరుపుకుంటాం. ఆ రోజున మనం లక్ష్మీదేవి, కుబేరుడితో పాటు శనిదేవుడిని కూడా పూజించుకుంటాం. ప్రత్యేకంగా దీపావళి పండుగ నాడు మనం శనిదేవుడిని కూడా పూజించుకుంటాం. ఇలా చేస్తే శని దోషాలుంటే పోయి జీవితం సంతోషంగా సాగుతుందట. శనిదేవుడిని కర్మ ప్రదాతగా చెబుతుంటారు. ఆయా జన్మలో సదరు వ్యక్తి చేసిన కర్మలను బట్టి శని దేవుడు ఫలితాలను ఇస్తూ ఉంటాడు.

దీపావళి నాడు లక్ష్మీ దేవినే కాకుండా శనేశ్వరుడిని సైతం పూజిస్తే మంచి ఫలితం ఉంటుంది. శని భగవానుడిని మీ శక్తి కొలదీ పూజిస్తే మంచి ఫలితం ఇస్తాడట. ఈ రోజున శనికి తైలాభిషేకం చేస్తే చాలా మంచిదని చెబుతారు. అలాగే హనుమంతుడిని ఈ రోజు పూజించుకున్నా శని అనుగ్రహం మనకు లభిస్తుందట. దీపావళి నాడు నల్ల చీమలకు పంచదార లేదంటే బెల్లాన్ని ఆహారంగా వేయాలి. అలాగే దీపావలఇ నాడు ఒక పాత్రలో నూనె పోసి దానిలో ముఖం చూసుకుంటే మంచిదట. ఆ తరువాత ఆ నూనెను పారే నీటిలో పోసి కాళ్లు, చేతులు కడుక్కుని వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి రావాలట. అలా చేస్తే ఆర్థిక కష్టాల నుంచి బయటపడతామట.

Share this post with your friends