కార్తీక మాసాన్ని కౌముది మాసం అని ఎందుకు పిలుస్తారు?

12 మాసాల్లో కార్తీక మాసానికి ఉన్నంత విశిష్టత మరే మాసానికి ఉండదు. శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీకం. కోటి పుణ్య ఫలాలను ప్రసాదించే మహిమాన్విత మాసంగా కార్తీక మాసాన్ని భావిస్తారు. ఈ మాసాలు చలి ప్రారంభమవుతుంది. ఈ తరుణంలో బ్రహ్మ ముహూర్తంలో స్నానాలు చేస్తారు. ఈ మాసమంతా దీపాలు వెలిగిస్తూ ఉంటారు. ఈ మాసంలో మనం కోల్పోయిన మానసిన ప్రశాంతత సైతం తిరిగి వస్తుందని నమ్ముతారు. ఈ మాసమంతా ప్రతి రోజూ ప్రత్యేకమే. పూజలకే కాదు.. శుభకార్యాలకు సైతం అనువైన మాసం.

కార్తీక మాసాన్ని కౌముది మాసం అని కూడా పిలుస్తారు. దీనికి కారణమేంటంటే.. కౌముది అంటే వెన్నెల అని అర్థం. మనం ఈ నెలలో బ్రహ్మ ముహూర్తానే స్నానమాచరిస్తాం. అంటే వెన్నెల కాంతి పడిన నీటితో స్నానం చేస్తాం. ఇదే కార్తీక మాసం ప్రత్యేకత. కాలువలు, చెరువులు, నదుల్లో కార్తీక మాసంలో ఒక్కరోజైనా స్నానమాచరిస్తాం. చంద్రుని కిరణాలు, ప్రకాశం, వెన్నెల చల్లదనం అంతా కాలువలు, చెరువులు, నదుల నీటి మీద పడి ఈ నీరు ఔషధంగా మారుతుంది. ఈ నీటిలో మనం స్నానమాచరిస్తే మనస్సు..శరీరం ఉత్తేజంగా మారుతుందని నమ్మకం. మొత్తానికి చంద్రుడు ఈ మాసంలో చాలా శక్తివంతంగా ఉంటాడు కాబట్టి కౌముది మాసం అని కూడా పిలుస్తారు.

Share this post with your friends