మహాకుంభమేళా ఆ నాలుగు ప్రాంతాల్లో ఎందుకు నిర్వహిస్తారు?

2025 జనవరిలో ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా జరగనుంది. అసలు కుంభమేళ ఎందుకు నిర్వహిస్తారో తెలుసుకుందాం. పురాణాల ప్రకారం.. సాగర మథనం జరిగిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ముందుగా హాలాహలం.. ఆ తరువాత అమృతం ఉద్భవించిన విషయం తెలిసిందే. ఈ అమృతం కోసం దేవతలు, రాక్షసుల మధ్య భీకర యుద్ధం జరిగింది. ఆ సమయంలో అమృతభాండం నుంచి అమృతం చుక్కలు కొన్ని భూమిపై నాలుగు ప్రదేశాల్లో పడ్డాయట. ఆ నాలుగు ప్రదేశాలు వచ్చేసి ప్రయాగ్‌రాజ్, హరిద్వార్, నాసిక్ , ఉజ్జయిని.

అమృతం చుక్కలు పడిన నాలుగు ప్రదేశాలలో కుంభ మేళా నిర్వహించే సంప్రదాయం మొదలైంది. అసలు అమృతం ఎలా కిందకు ఒలికింది అంటారా? కలశంలోని అమృతం కోసం దేవతలు, రాక్షసుల మధ్య యుద్ధం జరిగిన విషయం తెలిసిందే. ఆ యుద్ధ సమయంలోఆ కలశం నుంచి అమృత బిందువులు ఒలికాయి. అలా ఒలికిన అమృత చుక్కలు ప్రయాగరాజ్, హరిద్వార్, నాసిక్ , ఉజ్జయినిలో భూమిపై పడ్డాయి. అందుకే ఈ ప్రదేశాల్లో మహా కుంభమేళా, కుంభమేళ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

Share this post with your friends