శంఖం ఎందుకు అంత ప్రత్యేకం?

శంఖానికి హిందువులు అత్యంత ప్రాధాన్యతనిస్తారు. పూజ పూర్తైన వెంటనే శంఖం ఊదుతారు. ఇది ఊదితే ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ఉదయం పూజలో.. దేవాలయాల్లో.. శుభకార్యాల్లో ఒక ప్రత్యేక శబ్దం వినిపించేది శంఖనాదం. కానీ మనలో చాలామంది అదొక సంప్రదాయం అనుకుని వదిలేస్తాం. కానీ నిజం ఏంటంటే.. శంఖం కేవలం పూజా వస్తువు కాదు.. అది శాస్త్రం + ఆధ్యాత్మిక శక్తి కలయిక. సముద్రంలో లభించే ఒక ప్రత్యేక జీవపు అవశేషమే శంఖం. మన హిందూ సంప్రదాయంలో శంఖం అనేది పవిత్రతకు చిహ్నం. శుభానికి ఆరంభ సంకేతంగానూ.. దైవ సంకేతంగానూ శంఖం ఊదుతారు.

దేవాలయాల్లో శంఖం ఎందుకు ఊదుతారో తెలుసుకుందాం. శంఖం ఊదినప్పుడు ఒక నిర్దిష్ట ఫ్రీక్వెన్సీతో శబ్దం ఉత్పన్నమవుతుంది. ఆ శబ్ద తరంగాలు గాలి ద్వారా వ్యాపిస్తాయి. శాస్త్రపరంగా ఈ తరంగాలు మన చుట్టూ ఉన్న నెగటివ్ వైబ్రేషన్స్‌ని తగ్గిస్తాయని చెబుతారు. అందుకే పూజ ప్రారంభంలోనూ.. ఆరతి సమయంలోనూ.. ముఖ్య ఘట్టాల్లోనూ శంఖనాదం వినిపిస్తుంది. శంఖం ఊదినప్పుడు వచ్చే ధ్వని మన మెదడులో ఆల్ఫా వేవ్స్‌ని ఉత్తేజితం చేస్తుంది. తద్వారా మన మనసును ప్రశాంతంగా మారుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. పూజ సమయంలో మనకు అన్ని విధాలుగా ప్రశాంతమైన వాతావారణాన్ని సృష్టిస్తుంది.

Share this post with your friends