శివుడికి బిల్వ పత్రం అంటే ఎందుకు అంత ఇష్టమంటే..

భోళా శంకరుడైన శివుడికి చెంబుడు నీళ్లతో అభిషేకించినా చాలు.. లేదంటే బిల్వపత్రం తీసుకెళ్లి సమర్పించినా చాలు.. ఆనందంతో కోరిన కోరికలన్నీ తీర్చేస్తాడు. అసలు పరమేశ్వరుడికి ఎందుకు బిల్వ పత్రమంటే అంత ఇష్టం? అనేది చాలా మందికి తెలియదు. ఇప్పుడు తెలుసుకుందాం. ఆషాఢం త్వరలోనే వెళ్లిపోయి శ్రావణం వస్తుంది. ఈ శ్రావణ మాసానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. శ్రావణ మాసంలో రకరకాల వ్రతాలు ఆచరిస్తారు. అంతేకాదు.. శివ, కేశవులకు సైతం ప్రీతికరమైన మాసం ఇదేనట. కాబట్టి ఈ నెలలో వీరిద్దరిని కూడా పూజిస్తారు. శివయ్యకు జలాభిషేకం చేసి బిల్వ పత్రాన్ని సమర్పిస్తారు. బిల్వ పత్రం లేకుండా శివ పూజ అసంపూర్ణమని భావిస్తారు.

ఏడాది ఎప్పుడైనా సరే.. శివుడిని పూజిస్తే మాత్రం బిల్వ పత్రం తప్పనిసరిగా సమర్పిస్తారు. దీని వలన అనేక రెట్ల ఫలితం లభిస్తుందని చెబుతారు. పురాణాల ప్రకారం.. శివుడికి బిల్వ పత్రం ఎందుకు ప్రీతిపాత్రమైనదనడానికి రెండు కథలున్నాయి. మొదటిదేంటంటే.. సాగర మథనం గావిస్తుండగా తొలుత కాలకూట విషయం బయటకు రావడంతో శివుడు దానిని తన గరళంలో దాచేశాడు. శివుడి శరీరం విషం ధాటికి మండటం ప్రారంభం కావడంతో దానికి ఉపశమనం కోసం దేవతలు శివుడికి బిల్వ పత్రంతో ఉన్న నీటిని అందించారట. అది తాగిన పరమేశ్వరుడికి మంటలు తగ్గిపోయి శాంతించారట. అప్పటి నుంచి శంకరుడికి బిల్వ పత్రం సమర్పిస్తూ ఉంటారు.

Share this post with your friends