శరత్ పూర్ణిమ నాడు చంద్రకాంతిలో పాయసాన్ని ఎందుకు పెడతారు?

శరత్ పూర్ణిమను రాస పూర్ణిమ అని ఎందుకు పిలుస్తారో తెలుసుకున్నాం. ఇవాళ చంద్రోదయం సాయంత్రం 5.05 గంటలకు ఉంటుంది. ఈ రోజున చంద్రుడి వెన్నెలలో పాయసాన్ని ఉంచి పూజిస్తారు. దీనికి శుభ సమయం వచ్చేసి రాత్రి 8.40 గంటలకు ప్రారంభమవుతుంది. ఇవాళ బియ్యం, పాలతో చేసిన పాయసాన్ని చంద్రకాంతిలో పెట్టి పుజిస్తారు. అసలు ఇలా ఎందుకు చేస్తారనేది చాలా మందికి తెలియదు. దీనికి ఓ కారణం ఉంది. అన్ని రోజుల్లో చంద్రకాంతి వేరు.. శరత్ పూర్ణిమ రోజు రాత్రి చంద్రకాంతి వేరు. ఈ రోజున చంద్రకాంతిని చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తాం.

ఇవాళ చంద్రుడు 16 దశల్లో కనిపిస్తాడని చెబుతారు. చంద్రుడు శరత్కాలంలో తేజోవంతంగా ప్రకాశిస్తాడు. ఇది మన శరీరాన్ని, మనసును శుద్ది చేయడమే కాకుండా సానుకూల శక్తిని అందిస్తుంది. కాబట్టి శరత్కాలంలో చంద్రుని కిరణాలు మన దేహాన్ని తాకేలా వెన్నెలలో తిరిగితే మంచిదట. అంతేకాకుండా పాలు, బియ్యంతో చేసిన పరమాన్నాన్ని వెన్నెల కిరణాలు తగిలేలా పెట్టడం వలన దానికి అమృతం వంటి ఔషధ గుణాలు లభిస్తాయని హిందువుల విశ్వాసం. కాబట్టి ఈ రోజున పరమాన్నాన్ని తయారు చేసి ఒక పాత్రలో ఉంచి నెట్ గుడ్డ కప్పి చంద్రుడి వెన్నెలలో ఉంచుతారు. చంద్ర కిరణాలు దానిపై ప్రసరించిన మీదట ఇంట్లోకి తీసుకొచ్చి మరుసటి రోనజు ఉదయం ఆ పాయసాన్ని శ్రీ విష్ణువుకు నైవేద్యంగా సమర్పించి, అనంతరం కుటుంబ సభ్యులంతా స్వీకరిస్తారు.

Share this post with your friends