సుబ్రహ్మణ్యస్వామి ఎందుకు సర్పరూపంలో ఉంటాడు?

కుమారస్వామి సర్పరూపంలో ఉంటాడని మనకు తెలుసు. మరి అలా ఉండటానికి కారణమేంటనేది చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసి ఉంటుంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కుమార స్వామి భార్య శ్రీ వల్లీ దేవి ఆది శేషువుకి మనవరాలు. ఈ క్రమంలోనే ఒకసారి కుమార స్వామి శ్రీవల్లీ దేవిని చూసి ఆమెను వివాహం చేసుకోవాలని భావించాడట. వెంటనే ఆదిశేషు దగ్గరకు వెళ్లి నేను మీ మనవరాలు వల్లీ దేవిని కళ్యాణం చేసుకుంటానని చెప్పాడట. అప్పుడు ఆదిశేషు ఒక కండీషన్ పెట్టాడట.

‘నువ్వు మా అమ్మాయిని వివాహం చేసుకోవాలంటే.. మా బోయవారి వేషం ధరించాలని చెప్పారట. దానికి కుమారస్వామి సైతం సరేనని బదులిచ్చాడట. అయితే వల్లీదేవి కూడా ఒక కండీషన్ పెట్టిందట. ‘నేను సర్ప రూపంలో ఉంటాను కాబట్టి నన్ను చేసుకోవాలనుకునే మీరు కూడా సర్ప రూపంలో ఉంటేనే కల్యాణం చేసుకుంటాను’ అని చెప్పిందట. దీనికి సరేనన్న సుబ్రహ్మణ్య స్వామి వల్లీ దేవి కోసం సర్పరూపం ధరించాడట. అప్పటి నుంచి సుబ్రహ్మణ్య స్వామిని సర్పరూపంలో పూజిస్తున్నారు. కుమరస్వామి అనేది సుబ్రహ్మణ్య స్వామికి మరోపేరు.

Share this post with your friends