వసంత పంచమినాడే విద్యాభ్యాసాలెందుకు?

ఇవాళే వసంత పంచమి. ఈ రోజున మనం సరస్వతీదేవిని ప్రార్థించుకుంటాం. ఈ రోజున చాలా మంది తమ ఇంట ఉన్న చిన్నారులతో విద్యాభ్యాసం చేయిస్తారు. అసలు చిన్నారుల విద్యాభ్యాసానికి ఈ రోజే శుభదినంగా ఎందుకు ఎంచుకుంటారనో తెలుసుకుందాం. ఈ రోజున విద్యాభ్యాసం చేయిస్తే పిల్లలకి సరస్వతీ కటాక్షం లభించి మంచి స్థాయిలో ఉంటారని నమ్ముతారు. హిందూ పురాణాల ప్రకారం వసంత పంచమి రోజునే సరస్వతి దేవి జన్మించిందని చెబుతారు. అలాగే సరస్వతీదేవిని విద్య, సంగీతం, కళలకు ప్రతీకగా బ్రహ్మ దేవుడు సృష్టించాడని పురాణాలు చెబుతున్నాయి.

వసంత ఋతువులో వచ్చే వసంత పంచమి రోజున సరస్వతీ దేవికి ఆమె జన్మించిన రోజు కాబట్టి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ కాలంలో ప్రకృతి పచ్చదనంతో, పుష్పాలతో సుందరంగా ఉంటుంది. ఇలాంటి సమయం విద్యను ప్రారంభించడానికి అనుకూలమని చెబుతారు. అలాగే వసంత పంచమి రోజున అక్షరాభ్యాసం చేస్తే చదువులో రాణించి మంచి విజయలను అందుకుంటారని తల్లిదండ్రుల విశ్వాసం. విద్యార్థులు సైతం ఈ రోజున పెన్నులు, పుస్తకాలను పూజిస్తే విద్యాబుద్ధులు లభిస్తాయని నమ్మకం.

Share this post with your friends