
రాజస్థాన్‌లోని పుష్కర్ గురించి తెలుసుకున్నాం కదా.. ఈ బ్రహ్మదేవుడి క్షేత్రం చెంత ప్రతి ఏటా క్యామెల్ ఫెయిర్ జరుగుతుందని తెలుసుకున్నాం. ప్రసిద్ధి చెందిన ఈ క్యామెల్ ఫెయిర్‌కి దేశ విదేశాల నుంచి భక్తులు వస్తుంటారు. ఈ సమయంలో ఇక్కడకు వచ్చే వారంతా బ్రహ్మదేవుని ఆలయాన్ని దర్శించుకుంటారు. దీనికి ముందుగా పుష్కర్ సరస్సులో సాన్నం చేస్తారు. కాబట్టి దీనిని బ్రహ్మదేవునికి ప్రతి ఏటా జరిగే పుష్కర్ మేళాగా భావిస్తుంటారు. ఎడారి కావడంతో ఆ ప్రాంతమంతా చాలా వేడిగా ఉంటుంది.
అయితే ఈ క్యామెల్ ఫెయిర్ నిర్వహించే సమయంలో వాతావరణం చల్లగా ఉంటుంది. ఇక ఈ క్యామెల్ ఫెయిర్ సందర్భంగా నిర్వహించే వారోత్సవాల్లో
రాజస్థాన్ సంప్రదాయ సంగీత ప్రదర్శనలు, నాట్య ప్రదర్శనలతో పాటు సాముగారడీలు, పాములనాడించే వాళ్లు కూడా వస్తారు. ఇక ఈ సమయంలో అక్కడ పగటి పూట వాతావరణం 22 డిగ్రీలుగానూ.. రాత్రి పూట ఉష్ణోగ్రత 8 డిగ్రీలకు పడిపోతుంది. కాబట్టి విదేశాల నుంచి వచ్చేవారికి ఈ వాతావరణం అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఈ ఏడాది క్యామెల్ ఫెయిర్ వేడుకలు నవంబర్ 9 నుంచి 15 వరకు కొనసాగనున్నాయి.
