దుర్గమ్మకు నిమ్మకాయ దండ ఎందుకు వేస్తారు?

ఏ ఆలయంలో పూజకు వెళుతున్నా కొబ్బరికాయ తీసుకెళ్లడం సర్వసాధారణం. అయితే దుర్గాదేవి పూజకు వెళుతుంటే మాత్రం నిమ్మకాయను తప్పక తీసుకుని వెళతారు. దుర్గాదేవి ఆరాధనలో నిమ్మకాయకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఇతర అమ్మవార్ల పూజలో నిమ్మకాయను వినియోగించం. కేవలం శక్తి పూజలో మాత్రమే నిమ్మకాయను వినియోగిస్తాం. అసలు దుర్గాదేవి పూజలో మాత్రమే నిమ్మకాయల దండను సమర్పిస్తాం. అసలు ఎందుకలా? ఎందుకు అమ్మవారికి నిమ్మకాయ దండ అన్నా.. నైవేద్యంగా పులిహోర అన్నా ఎందుకంత ప్రీతి? తదితర విషయాలు తెలుసుకుందాం.

ముఖ్యంగా అమ్మవారు శక్తిస్వరూపిణి మాత్రమే కాకుండా నిత్యం శత్రుసంహారం, లయత్వం గావిస్తూ ఉంటుంది. అమ్మవారు సంహార క్రియ సమయంలో తామస ప్రవృత్తిని ప్రదర్శిస్తూ ఉంటుంది. గ్రామ దేవతలు సైతం దుర్గమ్మ స్వరూపాలేనని చెబుతారు. గ్రామాలకు రక్షణగా ఉండేందుకు రాత్రి వేళ సంచరిస్తూ దుష్ట సంహారం చేస్తారని ప్రతీతి. అలాంటి అమ్మవార్ల వీరత్వాన్ని నిమ్మకాయలు ప్రతిబింబిస్తాయని చెబుతారు. ఈ క్రమంలోనే ఎప్పటి నుంచో అమ్మవారికి నిమ్మకాయ దండలను సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. అంతేకాకుండా పుల్లగా ఉండే పులిహోరను నైవేద్యంగా సమర్పించినా కూడా అమ్మవారు శాంతిస్తుందని చెబుతారు.

Share this post with your friends