మనం గరుడ పంచమిని ఎందుకు చేసుకుంటామంటే..

మొత్తానికి గరుత్మంతుడు తను సంపాదించిన అమృతాన్ని తీసుకెళ్లి పాములకు ఇచ్చాడు. తానెంతో శ్రమపడి తెచ్చానని తాగి అమరులవ్వాలని పాములకు తెలిపాడు. ఆ తరువాత తన తల్లిని భుజాన ఎక్కించుకుని వాయు వేగంతో అక్కడి నుంచి పారిపోయాడు. అయితే నియమనిష్టల పేరుతో.. పాములను స్నానమాచరించాకే అమృతం తాగాలనే నిబంధనను ఇంద్రుడు పెట్టాడు. ఆ తరువాత అమృత పాత్రను ఇంద్రుడు తీసుకెళ్లిపోయాడు. అలా పాములకు అమృతం దక్కలేదు. దక్కి ఉంటే పాములు ఎప్పటికీ జీవించి ఉండేవి. తల్లి ఋణం తీర్చుకోవడానికి ఎంతో త్యాగం చేసిన గరుత్మంతుడిని ఎవరైనా ఆదర్శంగా తీసుకోవాలి.

మనం గరుడ పంచమిని మనం ఎందుకు జరుపుకుంటామో తెలుసా? నిర్మలమైన మనస్సు, తెలివైన పిల్లల కోసం గరుడ పంచమి నాడు పూజను ఆచరిస్తూ ఉంటాం. గరుడ పంచమి రోజున మహిళలు స్నానాంతరం ముగ్గులు పెట్టిన పీఠపై అరటి ఆకును పరచి, బియ్యం పోసి, వారి శక్తి మేర బంగారు, వెండి నాగపడిగను ప్రతిష్టించి, పూజ చేసి, పాయసం నైవేద్యం పెడతారు. మరికొన్ని ప్రాంతాలలో పుట్టలో పాలుపోస్తారు. ఇలా మన పూజలందుకొనే గరుడిని వంటి మాతృ ప్రేమకల కుమారుడు కావాలని తెలిపే గరుడ పంచమి వ్రతం ఆచరిస్తారు. అలాగే అనంత సౌభాగ్యాలను కలుగ చేస్తుందని నమ్మకం.

Share this post with your friends