హనుమంతుడు అనే పేరుకి పూర్తి వివరణ ఏంటంటే..

హిందూ సంప్రదాయంలో హనుమంతుడు అత్యంత పవిత్రమైన దేవతలలో ఒకరు. భక్తి, శక్తి, ధైర్యం, సేవాభావం అన్నింటికీ రూపం ఆయనే. ముఖ్యంగా రామాయణంలో ఆయన పాత్ర అపారమైనది.

హనుమంతుడు అనేక పేర్లతో ప్రసిద్ధుడు:

ఆంజనేయుడు: తల్లి అంజనాదేవి కుమారుడు కాబట్టి
పవనకుమారుడు: తండ్రి వాయుదేవుడు ద్వారా జన్మించాడు
కేసరీనందనుడు: తండ్రి కేసరి పేరు ఆధారంగా
బజరంగబలి: వజ్రంలాంటి శరీర బలం కలవాడు

హనుమంతుడు అనే పేరుకి పూర్తి వివరణ ఏంటంటే..
హనుమంతుడు అనే పేరుకి పూర్తి వివరణ ఏంటంటే..

బాల్య చిలిపితనం – సూర్యుడి సంఘటన

చిన్నప్పుడు హనుమంతుడు అసాధారణ శక్తితో ఉండేవాడు. ఒక రోజు ఆకాశంలో ఎర్రగా మెరిసే సూర్యుడు ను పండు అనుకుని దాన్ని తినాలని భావించాడు. వెంటనే ఆకాశంలోకి ఎగిరి సూర్యుడి వైపు పరిగెత్తాడు. అదే సమయంలో రాహువు కూడా సూర్యగ్రహణం కోసం వచ్చాడు. హనుమంతుడిని చూసి భయపడి వెనక్కి వెళ్లి ఇంద్రుడు దగ్గర ఫిర్యాదు చేశాడు.

అప్పుడు ఇంద్రుడు కోపంతో తన వజ్రాయుధాన్ని హనుమంతుడిపై ప్రయోగించాడు. ఆ వజ్రాయుధం హనుమంతుడి దవడ (హను) పై తగిలింది. దాంతో ఆయన స్పృహ తప్పిపోయాడు. ఇక్కడే పేరు ఉద్భవించింది: “హను” అంటే దవడ “మంతుడు” అంటే కలిగినవాడు. మొత్తంగా దవడ గాయపడినవాడు కాబట్టి హనుమంతుడు అని పేరు వచ్చింది.

Share this post with your friends