సంక్రాంతి సమయంలోనే కైట్స్ ఎందుకు ఎగురవేస్తారు?

తెలంగాణలో మాదిరిగా రాజస్థాన్, గుజరాత్‌లలో కైట్ ఫెస్టివల్ జరుగుతుందని తెలుసుకున్నాం కదా. ఈ సమయంలో ప్రతి చోటా ఆకాశంలో అందంగా ఎగురుతున్న గాలి పటాలను మనం చూడగలం. గుజరాత్, రాజస్థాన్‌లలో అంతర్జాతీయ గాలి పటాల పండుగను నిర్వహించడం జరుగుతోంది. రాజస్థాన్‌లోని జైపూర్‌లోనూ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ చూడవచ్చు. ఈ పండుగ రాజస్థాన్ ప్రజలు అత్యంత వైభవంగా జరుపుకునే పండుగలలో ఒకటి. రంగు రంగుల పతంగాలు ఎగురవేసేందుకు పింక్ సిటీగా పిలుచుకునే జైపూర్‌కు ఇతర దేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తుంటారు.

అసలు ఈ గాలి పటాలను సంక్రాంతి పండుగ సమయంలో ఎందుకు ఎగురవేస్తారో తెలుసుకుందాం. గాలి పటాలను ఎగురవేయడం వెనుక ఒక కథ ఉంది. వాస్తవానికి చలికాలం వచ్చిందంటే జలుబు, దగ్గు వంటి అంటు రోగాలు మనల్ని చుట్టుముడతాయి. ఉత్తరాయణంలో సూర్యుడు సంచరించినప్పుడు ఆ సూర్య కిరణాలు మన శరీరానికి ఔషధంగా పని చేస్తాయి. కాబట్టి ఉదయాన్నే బయటకు వచ్చి సంక్రాంతి నాడు రోజంతా ఎండలో గాలి పటాలను ఎగుర వేస్తారు. అలా ఎగురవేసినప్పుడు శరీరానికి సూర్య కిరణాలు తాకుతాయి. అలా మన శరీరం తిరిగి ఉత్తేజవంతమవుతుంది.

Share this post with your friends