
జుట్టును స్త్రీలు పెంచుకోవడానికి ఇష్టపడతారు. అయితే బ్రాహ్మణులు కూడా చిన్న పిలక ఉంచుతారు. ఇలా తలపై శిఖా లేదా చోటి ఉండటం అనేది.. మతపరమైన, ఆధ్యాత్మిక, శాస్త్రీయ ప్రాముఖ్యతకు నిదర్శనం. అసలు బ్రాహ్మణుడు లేదంటూ పూజారి, వేద పండితులు శిఖను ఎందుకుంచుకుంటారో తెలుసుకుందాం. మన శరీరంలో ఏడు చక్రాలు ఉన్నాయి. ఇవి వ్యక్తిలోని వెన్నెముక దిగువన ఉన్న మూలాధారం నుంచి ప్రారంభమై మన నెత్తిపై సహస్రారం వరకూ ఉండి శక్తి ప్రవాహంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇక బ్రాహ్మణుడు శిఖను సహస్రారం స్థానంలో ఉంచుతారు.
దీనికి కారణం.. సహస్రారంపై ఉన్న వెంట్రుకలు వారి చక్రాలను సమతుల్యం చేయడంలో సహాయపడటమే కాకుండా ఆధ్యాత్మిక మేల్కొలుపును కూడా ఇస్తుంది. హిందూ విశ్వాసం ప్రకారం.. అత్యున్నత చక్రం లేదా సహస్రారం ద్వారా ఆత్మ శరీరాన్ని వదిలేస్తుందట. శిఖను కట్టుకునే సమయంలో హరే కృష్ణ మంత్రాన్ని జపిస్తారు. తొలిసారిగా శిఖ లేదంటే ముడి కట్టుకునేవారు గాయత్రీ సాధన చేస్తారు. దీనిని వ్యక్తికి రెండవ జన్మ లేదంటే ద్విజత్వంగా పేర్కొంటారు. శిఖ అనేది శ్రీకృష్ణుడికి సంకేతం. శిఖ కోసం జుట్టును గట్టిగా కట్టినప్పుడు మానసిక నియంత్రణ, ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని కూడా మెరుగుపరుస్తుందట. ఇన్ని ఉపయోగాలున్నాయి కాబట్టే బ్రాహ్మణులు శిఖను కట్టుకుంటారు.
