గంగాదేవి శీతాకాలం నివాసంగా ఈ గ్రామం ఎందుకు మారిందంటే..

మఖ్వా ఆలయం ఎక్కడుంది? అక్కడ ఎవరు కొలువై ఉన్నారో తెలుసుకున్నాం కదా. ఉత్తరాఖండ్‌లోని మఖ్వా అనే అందమైన గ్రామంలో ఈ ఆలయం కొలువై ఉంది. ఈ గ్రామంలో మాతంగి బుుషి తపస్సు చేసి గంగా మాత శీతాకాలంలో ఇక్కడ కొలువై ఉండేలా వరం పొందాడని చెప్పుకున్నాం కదా. ఇక మరో మహర్షి మార్కండేయుడు కూడా ఈ ముఖ్వా గ్రామంలో తపస్సు చేసినట్లు పురాణ కథనం. ఇక్కడేమార్కండేయ పురాణాన్ని, ప్రసిద్దిగాంచిన మహా మృత్యుంజయ మంత్రాన్ని సమస్త మానవాళికి అందించాడు. శీతాకాలం ప్రారంభానికి ముందు గంగా దేవి విగ్రహాన్ని గంగోత్రి ధామ్ నుంచి ముఖ్వా గ్రామానికి భక్తులు ఊరేగింపుగా తీసుకువస్తారు.

దీనికి ఒక కారణం ఉంది. అదేంటంటే.. ఈ గంగోత్రి ధామ్‌లో భారీ హిమపాతం ఉండటంతో గంగోత్రి ఆలయ తలుపులు మూసివేస్తారు. అప్పుడు గంగా దేవి విగ్రహాన్ని ముఖ్వాలోని ముఖింనాథ్ ఆలయానికి తీసుకొస్తారు. గంగమ్మకు శీతాకాలం విడిదిగా భావిస్తారు. ఈ గ్రామం గంగా మాత శీతాకాల నివాసం. ఇక్కడే 6 నెలల పాటు ఉండి గంగమ్మ పూజలందుకుంటుంది. ఇక్కడ గంగా దేవిని పూజించే వారి కుటుంబ జీవితంలో సుఖ సంతోషాలు, సిరి సంపదలకు లోటుండదని నమ్మకం. లభిస్తాయని నమ్మకం. ఈ ఆలయాన్ని సందర్శించాలంటే ముందుగా రిషికేశ్ చేరుకుని అక్కడి నుంచి ఉత్తర కాశికి అక్కడి నుంచి హర్షిల్ వ్యాలీకి వెళ్లాలి. మొత్తంగా ఈ ఆలయం దేశ రాజధాని ఢిల్లీకి దాదాపు 480 కిలోమీటర్ల దూరంలో ఉంది.

Share this post with your friends