సముద్రుని కొడుకును విష్ణుమూర్తి ఎందుకు సంహరించాడు?

సముద్రుని కొడుకు శంఖంను విష్ణుమూర్తి సంహరించాడు. అసలు ఎందుకు శంఖంను విష్ణుమూర్తి సంహరించాల్సి వచ్చిందో తెలుసుకుందాం. విష్ణువు, సముద్రుడు, లక్ష్మీ దేవికి సంబంధించినది. ఒకరోజు క్షీరసాగరంలో శ్రీమహావిష్ణువు, లక్ష్మీదేవి కూర్చుని ఉండగా.. అప్పుడు సముద్రుడి కొడుకు శంఖం అక్కడికి చేరుకుని సముద్రంలో నివసించే జీవుల నుంచి పన్నులు వసూలు చేసే బాధ్యతను స్వీకరించాడు. పాతాళ లోకం, నాగ లోకంలోని వారంతా నిబంధనల ప్రకారం పన్ను చెల్లించేవారు. ఒకసారి శంఖం రాక్షసుల కుట్రలో చిక్కుకుని.. విష్ణువు నుంచి పన్ను వసూలు చేయడానికి వెళ్ళాడు.

అందరి నుంచి పన్ను వసూలు చేస్తున్నావు.. సముద్రంలో నివసిస్తున్న విష్ణువు,లక్ష్మీదేవి నుంచి ఎందుకు వసూలు చేయడం లేదని రాక్షసులు అడగడంతో శంఖం ఆవేశంతో విష్ణుమూర్తి నుంచి పన్ను వసూలు చేయడానికి వైకుంఠానికి వెళ్లాడు. శ్రీహరి ఎంత చెప్పినా వినకుండా దుర్భాషలాడాడు. పక్కనే ఉన్న లక్ష్మీదేవి వైపు చూస్తూ ఇంత అందమైన స్త్రీని తన దగ్గర కూర్చోబెట్టుకుని పన్నులు కట్టడం లేదంటూ విష్ణుమూర్తిని నిందించాడు. దీంతో విష్ణువుకి కోపం వచ్చింది. కౌమాది గదతో శంఖంపై దాడి చేయడంతో శంఖం మరణించాడు.

Share this post with your friends