తులసీదాస్‌ను అక్బర్ చక్రవర్తి చెరసాలలో బంధించిన సమయంలో అలవోకగా హనుమాన్ చాలీసాను రాశాడని చెప్పుకున్నాం. అసలు తులసీదాస్‌ను అక్బర్ చక్రవర్తి ఎందుకు చెరసాలలో బంధించాల్సి వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. 1600 ఏడీ సమయంలో అక్బర్ చక్రవర్తి రామ చరిత మానస్ వంటి అపురూపమైన గ్రంథాలను అనువదించాడు. రామ భక్తుడైన తులసీదాస్ ఎక్కడికి వెళితే అక్కడ జనం ఆయనకు బ్రహ్మరథం పట్టేవారు. ఒకసారి తులసీదాస్ మథురకు వెళ్లే క్రమంలో మార్గమధ్యంలో చీకటి పడటంతో ఆగ్రాలో బస చేశాడు. అక్కడ కూడా తులసీదాస్‌ను చూసేందుకు జనం పోటెత్తారు.ఈ విషయం అక్బర్ చక్రవర్తికి కూడా తెలిసింది. అసలు ఎందుకు ఆయనను చూసేందుకు జనం అంతలా ఎగబడుతున్నారో తెలుసుకునేందుకు బీర్బల్‌ను పిలిచాడు.
అసలు తులసీదాస్ ఎవరని అడిగాడు.. అప్పుడు బీర్బల్ ఆయనొక గొప్ప రామభక్తుడని చెప్పాడు. తనకు కూడా తులసీదాస్‌ను చూసి వస్తున్నానని చెప్పడంతో అక్బర్‌కు కూడా తులసీదాస్‌ను చూడాలనిపించి భటులను పంపించాడు. ఎర్రకోటకు హాజరు కావాలంటూ అక్బర్ చక్రవర్తి ఇచ్చిన సందేశంతో సైనికులు తులసీదాస్ వద్దకు వెళ్లారు. సందేశాన్ని విన్న తులసీదాస్‌ను తాను ఏ చక్రవర్తిని కలవబోనని తేల్చేశాడు. దీంతో ఆగ్రహించిన చక్రవర్తిని తులసీదాస్‌ను బంధించి తీసుకురావాలని ఆదేశించాడు. తులసీదాస్‌ను బంధించి భటులు ఎర్రకోటకు తీసుకొచ్చారు. మీ దగ్గర ఏవో మహిమలున్నాయని చూపించమని అడగ్గా.. తానొక సాధారణ భక్తుడినని.. మహిమలు చూపించ గల మాంత్రికుడిని కాదని అన్నారు. దీంతో ఆగ్రహించిన అక్బర్ చక్రవర్తి.. తులసీదాస్‌ను చెరసాలలో బంధించాడు. అక్కడే తులసీదాస్ హనుమాన్ చాలీసాను రాశాడు.