అభిమన్యుడు 16 ఏళ్లు మాత్రమే ఎందుకు జీవించి ఉన్నాడంటే..

శ్రీకృష్ణ పరమాత్ముడు భగవంతుడు కదా.. కురుక్షేత్ర యుద్ధం జరుగకుండా ఆపవచ్చు కదా.. లేదంటే అభిమన్యుడి మరణాన్ని అడ్డుకోవచ్చు కదా అనే సందేహాలు చాలా మందిలో ఉంటాయి. పాండవుల మధ్యముడు అర్జనుడు, శ్రీకృష్ణుడి సోదరి సుభద్ర కుమారుడు అభిమన్యుడి గురించి తెలియని వారుండరు. కౌరవులు పన్నిన పద్మవ్యూహాన్ని ఛేదించి ముందుకు వెళ్లాడు.. యోధానుయోధులతో యుద్ధం చేసి వారిని సంహరించాడు కానీ తిరిగి రావడం తెలియక కౌరవుల చేతిలో హతమయ్యాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే.

అభిమన్యుడు తల్లి సుభద్ర కడుపులో కడుపులో ఉన్న సమయంలోనే పద్మ వ్యూహాన్ని ఎలా ఛేదించాలో తెలుసుకున్నాడు. అయితే దాని నుంచి బయట పడే విధానం తెలియక మరణించాడు. మరి శ్రీకృష్ణుడు తన మేనల్లుడిని ఎందుకు రక్షించలేకపోయాడు? అంటే దీని ఒక కథ ఉంది. అభిమన్యుడు అంతకు ముందు జన్మలో చంద్రుని కుమారుడట. అతను పుట్టడానికి ముందే వయసు నిర్దారణ అయ్యిందట. చంద్రుడికి తన కుమారుడంటే అమితమైన ప్రేమ ఉండటంతో తన కొడుక్కి దూరంగా ఉండటానికి ఇష్టపడక 16 ఏళ్లు మాత్రమే భూమిపై ఉండేందుకు పర్మిషన్ ఇచ్చి పంపాడట. అందుకే అభిమన్యుడు భూమిపై 16 ఏళ్లు మాత్రమే ఉన్నాడట.

Share this post with your friends