పూజ సమయంలో ఆహారంలో ఉల్లి, వెల్లుల్లి నిషేధం ఎందుకు?

సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నా.. అయ్యప్ప స్వామి పడిపూజ పెట్టుకున్నా.. విఘ్నేశ్వరుడికి నైవేద్యం సమర్పించినా.. మరికొన్ని సందర్భాల్లో ఆహారంలో ఉల్లి, వెల్లుల్లిని వాడకూడదని చెబుతారు. దీనికి కారణమేంటనేది చాలా మందికి తెలియదు. అదేంటో చూద్దాం. వాస్తవానికి భగవంతుడికి పూజ సమయంలో మనం ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారం వంటివి నిషేధం అని అందరికీ తెలిసిందే. మరి ఉల్లి, వెల్లుల్లి ఎందుకు అంటారా? వాస్తవానికి ఉల్లి, వెల్లుల్లి మట్టిలో పెరుగుతాయి. అయినా కూడా వీటిని శాఖాహారంగా పరిగణించరు. తామసిక ఆహారంగా భావిస్తూ ఉంటారు. కాబట్టి పూజా సమయంలో వాటిని నిషేధించడం జరిగింది.

పండితులు లేదా పూజారులు వెల్లుల్లి, ఉల్లిపాయలను తినకూడదని సలహా ఇస్తారు. ముఖ్యాన్ని ఆహారాన్ని మూడు భాగాలుగా విభజించడం జరిగింది. పురాణ గ్రంథాల ప్రకారం ఆహారం మూడు భాగాలుగా విభజించబడింది. సాత్వికం, రాజసం, తామసిక ఆహారం అంటూ మూడు రకాలుగా విభజించడం జరిగింది. మనం తీసుకునే ఆహారంలో మన మనసు ఉంటుందని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఆ ఆహారం జీవితంతో పాటు మనసుపై ప్రభావం చూపుతుంది. అది మన ఆలోచనలతో పాటు మానసిక స్థితిని కూడా ప్రభావితం చేస్తుందని అంటారు. అప్పుడు మన మనసు భగవంతుడిని నుంచి అదుపు తప్పుతుందని చెబుతారు.

Share this post with your friends