అమ్మవారి అష్టలక్ష్మీ స్వరూపాలు ఎందుకు?

హిందూ సంప్రదాయం ప్రకారం శుక్రవారం లక్ష్మీదేవిని ఆరాధించుకుంటామని తెలిసిందే. లక్ష్మీదేవిని ఆరాధిస్తే ఐశ్వర్యం కలుగుతుందట. అసలు ఐశ్వర్యం అంటే ఏంటి? ధనమేనా? అంటే కాదు.. జీవితంలో మనకు ఆనందాన్నిచ్చేది ఏదైనా కూడా ఐశ్వర్యమే. ఆసక్తికరంగా ఒక్కో ఐశ్వర్యానికి ఒక్కో పేరు ఉంటుంది. ఆ పేర్లకు తగ్గట్టుగానే లక్ష్మీదేవి అవతారాలు స్వీకరించిందట. మరి శ్రీ మహాలక్ష్మీ అవతారాలేంటో తెలుసుకుందాం. అమ్మవారి అవతారాలు ఎనిమిది. భక్తాభీష్ట ప్రదాయిని, వరప్రదాయిని అయిన జగన్మాత శ్రీ మహాలక్ష్మి అష్టలక్ష్మీ రూపాల్లో ఈ జగత్తును పరిపాలిస్తోంది.

విష్ణుమూర్తి ఎలాగైతే జగత్ కల్యాణం కోసం దశావతారాలు ధరించాడో.. అలాగే ఆయన పత్ని లక్ష్మీదేవి అష్టావతారాలు ధరించిందట. అష్టావతారాలు లోక కల్యాణానికి హేతువులని, దుష్ట రక్షణ, శిష్ట రక్షణ కోసమేనని శాస్త్రాలు చెబుతున్నాయి. విష్ణు పురాణం, బ్రహ్మాండ పురాణంలో కూడా శ్రీలక్ష్మీదేవి అష్టావతారాల ప్రస్తావన ఉంటుంది. మానవ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోవాలంటే ఈ అష్టలక్ష్మీ స్వరూపాల అనుగ్రహం తప్పనిసరి అంటారు. అసలు అమ్మవారు కూడా ఇలా అందరికీ అన్ని రకాల శక్తులను అందించటం కోసమే అష్టలక్ష్మీ రూపాలను ఎంచుకుందని అంటారు.

Share this post with your friends