
రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్ జిల్లాలో ఉన్న గోగమేడి ఆలయం గురించి తెలుసుకున్నాం కదా. ఈ ఆలయ ప్రత్యేకత ఏంటో కూడా తెలుసుకున్నాం. ఈ ఆలయంలో తామసిక ఆహారమైన ఉల్లిపాయలను ప్రసాదంగా అందజేస్తారు. ఈ ఆలయం దగ్గర పెద్ద ఎత్తున ఉల్లిపాయల రాశులు మనకు దర్శనమిస్తాయి. గోగమేడి ఆలయం ఎందుకు అంత ప్రత్యేకమైనది? ఎందుకు ఇక్కడ ఉల్లిపాయలను ప్రసాదంగా అందజేస్తారో తెలుసుకుందాం. గోగమేడి ఆలయంలో కొలువైన గోగాజీని జహర్‌వీర్ గోగాజీ లేదా గోగా వీర్ అని కూడా భక్తులు పిలుచుకుంటారు.
సర్వాల దేవుడిగా జవహర్ గోగాజని పూజిస్తారు. ఈ ఆలయానికి కేవలం రాజస్థాన్ నుంచి మాత్రమే కాకుండా.. హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి సైతం ఈ ఆలయానికి భక్తులు వస్తుంటారు. ఇక్కడ ఉల్లిపాయలను ప్రసాదం అందించడం వెనుక సంప్రదాయం మరేదో కాదు.. ఈ ఆలయం బయట పెద్ద ఎత్తున ఉల్లిపాయలను రాశులుగా పోస్తారు కదా.. వాటి అమ్మకంతో వచ్చే డబ్బుతో ఆలయంలోని భండార, గోశాల నిర్వహణ గావిస్తూ ఉంటారు. ఇంతకు మించి ఇక్కడ ఉల్లిపాయలను ప్రసాదంగా సమర్పించడం వెనుక మరో కారణమేమీ లేదు.
రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్ జిల్లాలో ఉన్న గోగమేడిని సందర్శించే భక్తులు ముందుగా గోరఖ్ గంగాలో స్నానం చేసి.. ఆ తర్వాత అదే పవిత్ర జలంతో ఖీర్‌ని తయారు చేస్తారు. ఆ తర్వాత భక్తులు గోరఖ్ తిలాకు వెళ్లి ఉల్లిపాయ, పప్పును సమర్పిస్తారు. ఈ ఆలయంలో బియ్యం, బటాషాను కూడా అందిస్తారు. ఇక్కడి గోగాజీకి ఉల్లిపాయను సమర్పిస్తే తప్పక కోరిన కోరిక నెరవేరుతుందని భక్తుల నమ్మకం. ధైర్యం, ప్రజా సేవపై విశ్వాసానికి చిహ్నంగా గోగాజీని భక్తులు భావిస్తారు. భక్తులను రక్షించేందుకు గోగాజీ తన జీవితాన్ని త్యాగం చేశాడని చెబుతారు.
