శ్రీమంతంలో మట్టి గాజులు ఎందుకు తొడుగుతారు?

గాజుల ప్రాధాన్యత గురించి తెలుసుకున్నాం కదా.. పూర్వ కాలంలో అయితే స్త్రీ పురుషులిద్దరూ గాజులను వేసుకునేవారు. ఆ తరువాత కాలక్రమంలో స్త్రీ మాత్రమే వేసుకుంటోంది. చేతినిండా గాజులు వేసుకుని స్త్రీ ఇంట్లో తిరుగుతూ ఉంటే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీ నడయాడుతున్నట్టే ఉంటుంది. ఇకపోతే స్త్రీకి మాతృత్వం ఓ వరం. అందుకే ఆమెకు మంచిగా కాన్పు కావాలని ఆశిస్తూ కుటుంబ సభ్యులు శ్రీమంతం చేస్తూ ఉంటారు. ఆ సమయంలో రెండు చేతుల నిండా ముత్తైదువులు మట్టి గాజులు వేస్తారు. శ్రీమంతంలో గాజులకే పెద్ద పీట. అసలెందుకు శ్రీమంతంలో మట్టి గాజులు గర్భిణికి తొడుగుతారు అంటే దానికి అద్బుతమయిన కారణాలు ఉన్నాయి.

స్త్రీ గర్భం దాల్చిన ఐదు నెలలకు ఆమె గర్భంలో ఉండే పిండానికి ప్రాణం వస్తుంది, శిశువు ఎంత సున్నితంగా వుంటుందో.. తనను ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో, గాజుల రూపంలో(గాజులు సున్నితమైనవే కదా) తెలిజేస్తారట. మోచేతికి, మణికట్టుకు మధ్య ప్రాంతంలో వుండే నాడులు గర్బాశయ నాడులతో అనుసంధానం అయి ఉంటాయట. స్వల్ప వత్తిడి గాజుల ద్వారా కలుగజేయడం వలన గర్భాశయంలోని నాడులు కూడా అందుకు అనుగుణంగా ఉత్తేజితమయి, గర్భంలోని కండరాలు సరిగా పనిచేసే దానికి దోహదపడుతాయట. అంతేకాదు గాజులు ధరించిన చేతులు గర్భానికి దగ్గరగా ఉంటాయి కనుక గర్బంలో వుండే శిశువు కు గాజుల సవ్వడి స్పష్టం గా వినబడి ,శిశువు వినికిడి శక్తి పెరిగేందుకు సహాయపడుతాయి.

Share this post with your friends