
హిందువులకు ప్రతిరోజుకూ ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. త్వరలోనే దీపావళి రానుంది. ఈ దీపావళిని కొన్ని ప్రాంతాల్లో మూడు రోజుల పాటు నిర్వహించుకుంటారు. ఇక దీపావళి వెళ్లిన తర్వాత గోవర్ధన పూజ జరుపుకుంటాం. అయితే ఈ గోవర్థన పూజ గురించి చాలా మందికి తెలియదు. కన్నయ్య గోవర్ధన గిరిని ఎత్తి భక్తులను రక్షించాడని చెబుతుంటారు. ఇది హిందువులందరికీ దాదాపుగా తెలుసు. ఆ గోవర్థన కొండను ఎత్తిన రోజున మనం అన్నకూట మహోత్సవం లేదా గోవర్థన గిరి పూజ జరుపుకుంటాం.
ఈ గోవర్థన పూజ ఈ ఏడాది ఎప్పుడు రానుందో తెలుసుకుందాం. హిందూ క్యాలెండర్ ప్రకారం గోవర్థన పూజ తిథి నవంబర్ 1న సాయంత్రం 6.16 గంటలకు ప్రారంభమై ఆ తరువాత నవంబర్ 2 రాత్రి 8:21 గంటలకు ముగుస్తుంది. మనం ఏ పండుగనైనా ఉదయ తిథి ప్రకారం జరుపుకుంటాం కాబట్టి గోవర్థన పూజను నవంబర్ 2వ తేదీన జరుపుకుంటాం. ఇక గోవర్థన పూజ నిర్వహించుకునేందుకు శుభ సమయం ఏంటంటే.. ఉదయం 5.34 నుంచి 8.46 వరకూ.. అంటే మొత్తం 2 గంటల 12 నిమిషాల సమయం పూజకు అనువుగా ఉంటుంది. రెండవ ముహూర్తం మధ్యాహ్నం 3:23 నుంచి సాయంత్రం 5:35 వరకు ఉంది.
