లక్ష్మీదేవిని సముద్రుడు ఎందుకు, ఏమని శపించాడు?

సముద్రుని కుమారుడు శంఖంని విష్ణుమూర్తి సంహరించిన విషయం తెలుసుకున్నాం కదా. విష్ణుమూర్తి శంఖంని సంహరించిన తరువాత ఏం జరిగిందో ఇప్పుుడు మనం తెలుసుకుందాం. విష్ణువును ఇష్టానుసారంగా తూలనాడిన శంఖంని విష్ణువు కౌమాది గదతో దాడి చేసి సంహరించాడు. కుమారుడి మరణ వార్త తెలుసుకున్న సముద్రుడు తన నిగ్రహాన్ని కోల్పోయి క్షీర సాగరాన్ని చేరుకున్నాడు. శ్రీ మహా విష్ణువు చెప్పేది వినకుండా విష్ణువుని శపించాడు.

అసలు లక్ష్మీదేవి కారణంగానే శ్రీ హరి తన కుమారుడిని చంపాడని సముద్రుడు నమ్మాడు. అప్పుడు లక్ష్మీదేవి .. శ్రీహరి నుంచి విడిపోయి సముద్రంలో కలిసిపోతుందని శంపించాడు. సముద్రుడి శాపం కారణంగా లక్ష్మీదేవి సముద్రంలో కలిసి అదృశ్యమైంది. లక్ష్మీ దేవిని తిరిగి ఇవ్వమని శ్రీహరి సముద్రుడిని ఎంత కోరినా శ్రీ హరి మాట వినలేదు. దీంతో సముద్రుడు దేవతలు, రాక్షసులు కలిసి అమృతం కోసం సముద్రాన్ని మథనం చేసేలా చేశాడట. అలా సాగర మథనం గావిస్తుండగా సముద్రుడు తన గర్భంలో ఉన్న ఎన్నో అమూల్యమైన రత్నాలను పోగొట్టుకున్నాడు. ఇక చివరికి చేసేదేమీ లేక తన ఓటమిని అంగీకరించాడు. లక్ష్మీ దేవిని, అమృత కలశాన్ని సముద్రుడు దేవతలకు అందించాడు. అప్పుడు శ్రీ హరి మరోసారి లక్ష్మీ దేవిని వివాహం చేసుకున్నాడు.

Share this post with your friends