మణిదీప నివాసిని పూజకు ఎన్ని రకాల నైవేద్యాలను వినియోగిస్తారు? ఏమేం పూజకు వినియోగిస్తారో తెలుసుకున్నాం కదా. రెండు రకాల పువ్వులను వినియోగించరని కూడా తెలుసుకున్నాం. ఇక ఏ ఏ రకాల పువ్వులను పూజలో వినియోగిస్తామో కూడా తెలుసుకుందాం. పూజకు వినియోగించే 32 రకాల పువ్వులేంటంటే.. మల్లెపువ్వులు,
గులాబి, సన్నజాజి, విరజాజి, సెంటుమల్లి, డిసెంబర్ పువ్వులు, చామంతులు, లిల్లీ, ముద్ద గన్నేరు పువ్వులు, నందివర్ధనం, పారిజాత పూలు, చంద్రకాంత పూలు, సువర్ణ గన్నేరు పూలు, కలువ పూలు, పాటలీ పుష్పాలు, ముద్ద నందివర్ధనం, గన్నేరు పూలు, కదంబ పూలు, మందారాలు, తామరలు, కనకాంబరాలు, దేవ గన్నేరు పూలు, అశోక పుష్పాలు, నిత్య మల్లెపువ్వు, కుంకుమపువ్వు, పొన్నపువ్వు, మంకెనపువ్వు, పున్నాగ పుష్పాలు, కాడమల్లె, నాగమల్లి, చంపక, నూరు వరహాలు.
మణిద్వీప వర్ణన మహత్యం ఏంటో తెలుసుకుందాం. దేవి భాగవతంలో ఈ మణిద్వీప వర్ణన గురించి వివరించడం జరిగింది. దీని ప్రకారం శ్రీ చక్ర బిందు రూపిణి శ్రీ లలితా మహా త్రిపుర సుందరి అమ్మవారు నివాసముండే పవిత్ర ప్రదేశమే మణి ద్వీపం. అమ్మవారు.. పధ్నాలుగు లోకాలకు పైన ఉండే సర్వలోకంలో కొలువై ఉంటారని చెబుతారు. అక్కడ ఉంటూ ఈ జగత్తు మొత్తాన్ని పరిరక్షిస్తుందట. అమ్మవారి మనసులో ఏర్పడిన ఆలోచనలకు అనుగుణంగా ఈ లోకం ఉద్భవించింది. ఈ మణిద్వీపానికి నలువైపులా అమృతంతో కూడిన సముద్రం సరిహద్దులుగా ఉంటుందట. కాబట్టి దీన్ని వర్ణించేందుకు మన శక్తి చాలదట.