అసలు యోగా తొలి గురువు ఎవరు? ఎవరికి యోగాను బోధించాడు?

యోగా చరిత్ర మన పురాణ గ్రంథాలలో దాగి ఉందని ముందుగానే చెప్పుకున్నాం. ముఖ్యంగా జ్ఞాన యోగం, భక్తి యోగం, కర్మ యోగం, రాజ యోగం భగవద్గీతలో ప్రస్తావించబడ్డాయని కూడా తెలుసుకున్నాం. ఇప్పడు మొదటి యోగా గురువు ఎవరో కూడా తెలుసుకుందాం. మొదటి యోగా గురువు మరెవరో కాదు.. ఆ పరమేశ్వరుడే. యోగాలో మొదటి యోగి మహేశ్వరుడే కావడంతో ఆయనను ఆది యోగి అని పిలవడం జరుగుతోంది. అసలు దీనికి సంబంధించిన కథేంటో ముందుగా తెలుసుకుందాం.

హిమాలయాలలోని కాంతి సరోవర్ సరస్సు ఒడ్డున ఆదియోగి శివుడు.. ఈ జ్ఞానాన్ని తొలుత పురాణ సప్త ఋషులకు అందించాడని చెబుతారు. ఆ తరువాత ఈ సప్త ఋషులు యోగాను మరింత డెవలప్ చేశారని చెబుతారు. అలాగే శివుడు మాత్రమే శరీరం, మనస్సు మధ్య సామరస్యాన్ని ఏర్పరచగలడని అంటారు. మరో కథనం ప్రకారం శివుడిని ఒకసారి పార్వతీ మాత మీ శరీరం ఎందుకు ఎప్పుడూ అంతలా మెరుస్తూ ఉంటుంది.. దాని వెనుక ఉన్న రహస్యమేంటో చెప్పమని అడిగిందట. అప్పుడు పార్వతీమాతకు శివుడు యోగా గురించి చెప్పాడని కూడా అంటారు. శివుడి నటరాజ విగ్రహాన్ని చూసినా లేదంటే వివిధ భంగిమలు చూసినా కూడా ఆయన యోగాకు తొలి గురువు అని చెబుతాయి.

Share this post with your friends