అసలు గత జన్మలో మంథర ఎవరు?

రామాయణంలో శ్రీరామ చంద్రుడిని అరణ్య వాసానికి పంపించడంలో కీలక పాత్ర పోషించిన మంథర ఎవరు? అనే విషయాలను ఇప్పటికే తెలుసుకున్నాం. ఆమె స్వయానా ఓ యువరాణి. కైకేయి అశ్వపతి చక్రవర్తి కుమార్తె కాగా.. మంథర ఆయన సోదరుడు వృహదశ్వుని కుమార్తె. మంథర చాలా తెలివైనది అలాగే మంచి అందగత్తె అని కూడా తెలుసుకున్నాం. తన అనారోగ్యం కారణంగా విపరీతమైన దాహార్తిని తగ్గించుకునేందుకు ఓ ద్రవం తాగగా ఆమె శరీర భాగాలన్నీ పని చేయడం మానేశాయి. ఆమె తండ్రి చికిత్స చేయించగా వ్యాధి నయమైంది కానీ వెన్నెముక శాశ్వతంగా వంకరగా మారిందట. ఇక్కడి వరకూ మనకు తెలిసిందే.

ఈ జన్మలో అంటే కైకేయికి ప్రాణ స్నేహితురాలు, సోదరి. ఎప్పుడూ ఆమెను మంథర విడిచి పెట్టింది లేదు. అయితే గత జన్మలో మంథర ఎవరు? అనేది చాలా మందికి తెలియదు. ఆమె ఎవరో తెలుసుకుందాం. మంథర ఒక గంధర్వ కన్య. ఆ జన్మలో ఆమె పేరు దుందుభి. రావణుడి కారణంగా విపరీతంగా కష్టాలు పడి వాటి నుంచి విముక్తి కోసం బ్రహ్మను దుందుభి ప్రార్థించింది. దుందుభి ప్రార్థనకు సంతోషించిన బ్రహ్మ ఆమెకు వరం ఇచ్చాడు. వచ్చే జన్మలో నీ మాటల కారణంగా శ్రీరాముడు అరణ్య వాసానికి వెళ్లి రావణడుని సంహరిస్తాడని తెలిపాడు. అలా మంథర కారణంగా శ్రీరాముడు అరణ్య వాసం చేసి రావణుడిని సంహరించాడని పురాణాలు చెబుతున్నాయి.

Share this post with your friends