వెండి ఆభరణాలను ఎవరు పడితే వారు ధరించకూడదని తెలుసుకున్నాం కదా. కనుక వెండి ఆభరణాలను ఏ వ్యక్తులు ధరించకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
కొందరు వ్యక్తులు చాలా భావోద్వేగంగా ఉంటారు లేదా చాలా కోపంగా ఉంటారు. అలాంటి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ వెండి ఆభరణాలు ధరించకూడదు. ఒకవేళ ధరిస్తే వారిలో కోపంతో పాటు ఉద్వేగం మరింత పెరుగుతుందట. ఎవరి జాతకంలో చంద్రుడు 12వ లేదా 10వ ఇంట్లో ఉంటాడో వారు వెండి ఆభరణాలు ధరించనే కూడదట. అలా కాదని ధరిస్తే లేని పోని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందట.
వృషభం, మిథునం, కన్య, మకర రాశి, కుంభ రాశి వారు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ జ్యోతిష్యం ప్రకారం వెండి ఆభరణాలు ధరించడం మంచిది కాదని పండితులు చెబుతున్నారు. శుక్రుడు, బుధుడు, శనీశ్వరుడు ఎవరి జాతకంలో అయితే ఆధిపత్యంలో ఉంటాడో వారు కూడా వెండి ఆభరణాలు ధరించకూడదట. అలాగే జాతకంలో చంద్రుడు క్షీణించిన వారు సైతం వెండి ఆభరణాలను ధరించకూడదట. కాబట్టి చల్లని స్వభావం ఉన్నవారు వెండికి దూరంగా ఉండాలట. మేష రాశి, సింహ రాశి, ధనుస్సు రాశుల వారు సైతం వెండి ఆభరణాలు ధరించకూడదని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.