శరన్నవరాత్రులలో తొలి మూడు రోజులు ఎవరిని పూజిస్తారు?

హిందువుల అత్యంత ముఖ్యమైన పండుగలలో దసరా కూడా ఒకటి. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజుల పాటు దేవీ నవరాత్రులు నిర్వహిస్తారు. ఆపై పదవ రోజును విజయ దశమి లేదా దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగను నవరాత్రి లేదంటే శరన్నవరాత్రి అని పిలుస్తారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక శరన్నవరాత్రి పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతిదేవికి తరువాతి మూడు రోజుల లక్ష్మీ దేవికి.. తరువాత మూడురోజులు సరస్వతి దేవికి పూజలు నిర్వహిస్తారు.

ఈ పండుగ నాడు బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితీ. ఆలయాలలో అమ్మవారికి ఒక్కోరోజు ఒక్కో అలంకారం చేస్తారు. పదవరోజు దసరా పండుగ జరుపుకోవడం ఆనవాయితీ. తెలుగు వారు దసరాని పది రోజుల పాటు జరుపుకుంటారు. నవరాత్రులు దుర్గ పూజ ఉంటుంది. తెలంగాణలో ఈ తొమ్మిది రోజులు అంటే అమావాస్య నుంచి నవమి వరకు బతుకమ్మ ఆడుతారు. జగన్మాత అయిన దుర్గా దేవి, మహిషాసురుడనే రాక్షసునితో 9 రాత్రులు యుద్ధము చేసి అతడిని వధించి జయాన్ని పొందిన సందర్భమున 10వ రోజు ప్రజలంతా సంతోషముతో దసరా పండుగను జరుపుకుంటారు. దానిని విజయ దశమి అని కూడా పిలుస్తారు.

Share this post with your friends