రామాయణంలో అసలు ఎవరీ మంథర?

రామాయణంలో మంథర పేరు వినని వారు ఉండరు. ఒకరకంగా మానవుడైన శ్రీరామచంద్రుడు దేవుడిగా కొలవబడుతున్నాడంటే ఈమె ఒక ముఖ్య కారణం. మంథర లేకుంటే రాముడి వనవాసం లేదు.. ఆ తరువాత జరిగిన పరిణామాలన్నీ ఉండవు. శ్రీరాముడు వనవాసానికి వెళ్లిన తరువాత బెంగతో దశరథ మహారాజు మరణించినా కూడా కైకేయి మాత్రం మంథరను వీడలేదు. తన వద్దే ఉంచుకుంది. అసలు అంత ప్రాధాన్యత మంథరకు కైకేయి ఎందుకు ఇచ్చింది? అసలు ఎవరీ మంథర? అంటే ముందుగా కైకేయి దశరథ మహారాజును వివాహమాడటానికి ముందు ఎవరనేది తెలుసుకోవాలి.

కైకేయి అశ్వపతి చక్రవర్తి కుమార్తె. చాలా అందమైన, ధర్మ నిరతి కలిగిన యువతి మాత్రమే కాకుండా ధైర్యవంతురాలు. కైకేయి పరిచారికే మంథర. అలాగే అశ్వపతి రాజు సోదరుడు వృహదశ్వుని కుమార్తె. మంథర సైతం అందమైన యువరాణి. కైకేయికి మంథర సోదరి కావడంతో మంచి స్నేహితుల్లా మెలిగేవారు. కైకేయి, మందర ఒకరిని విడిచి ఒకరు ఉండేవారు కాదు. అలా దశరథ మహారాజుతో వివాహానంతరం కైకేయి తన పరిచారిక మందరతో కలిసి అయోధ్యలో అడుగు పెట్టింది. కైకేయి ప్రతి పనిలోనూ మంథర కల్పించుకునేది. ప్రతి పనిలోనూ సలహాదారుగా మారిపోయింది.

Share this post with your friends