కార్తీక మహత్యాన్ని ఎవరికి ఎవరు వివరించారు?

పవిత్రమైన కార్తీక మాసంలో కార్తీక పురాణం గురించి చదివినా, విన్నా పుణ్యమేనని చెబుతారు. కార్తీక పురాణంలో ప్రతి రోజూ ఒక్కో కథ ఉంటుంది. ప్రతి కథ నుంచి మనం ఏదో ఒక నీతిని గ్రహిస్తాం. మనిషి ఎలా జీవించాలి? ఆధ్యాత్మిక మార్గంలో ఎలా పయనించాలి? అనేవి కార్తీక పురాణంలోని కథల ద్వారా మనం తెలుసుకోవచ్చు. కార్తీక మహత్యాన్ని వివరించమని వశిష్టుని జనకుడు కోరాడు. పూర్వం ఒకసారి సిద్ధాశ్రమంలో యాగం జరుగుతోందట. ఈ యాగ కార్యక్రమానికి అవసరమైన ద్రవ్యం కోసం వశిష్ఠ మహర్షి జనక మహారాజు ఇంటికి వెళ్లాడు.

అప్పుడు వశిష్ట మహర్షికి ఎంత ద్రవ్యం కావాలంటే అంత ఇచ్చేందుకు ఆనందంగా అంగీకరించి అందుకు బదులుగా తనకు సర్వ పాపహరమైన ధర్మ సూక్ష్మాన్ని తెలియజేమని కోరుతాడు. అలాగే కార్తీక మాసం సర్వ మాసముల కంటే శ్రేష్టమైనదని.. అత్యంత మహిమాన్వితమైనదని జనక మహారాజు పేర్కొన్నాడు. ఈ నెలకు అంత ప్రాముఖ్యత కలగడానికి కారణమేంటని అడిగాడు. దీనికి వశిష్టుడు ఎంతో పుణ్యం చేసుకున్నావు కాబట్టి ఈ కథ విన్నంత మాత్రాన అన్ని పాపాలను హరించేది కార్తీక మహత్యమని పేర్కొన్నారు. విశ్వ శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని కార్తీక మహత్యాన్ని వివరించాడు.

Share this post with your friends