మధుర శ్రీకృష్ణుడి ఆలయాన్ని ఎవరు నిర్మించారంటే..

శ్రీకృష్ణుడు కారాగారంలో జన్మించాడు. ఈ విషయం అందరికీ తెలిసిందే. పురాణాల ప్రకారం.. ఆ ప్రాంతం మధురలో ఉంది. మధురలో శ్రీకృష్ణుడు జన్మించిన జైలు కేంద్రంగా ఒక పెద్ద ఆలయాన్ని నిర్మించారు. ఈ మధురా నగరం దేశ రాజధాని నుంచి ఢిల్లీకి 145 కి.మీ దూరంలో.. యమునా నది ఒడ్డున ఉంది. అసలు ఈ మధుర నగరాన్ని ఎవరు నిర్మించారని అంటారా? పురాణాల ప్రకారం చంద్రవంశానికి చెందిన రాజు పురూరవుడు, అప్సరస ఊర్వశిల పుత్రుడైన ఆయువు యమునా తీరంలో ఈ నగరాన్ని నిర్మించాడట. ఈ మధుర నగరం.. సప్త మోక్ష క్షేత్రాలలో ఒకటిగా విరాజిలుతోంది.

మధుర సప్త మోక్షాలలో ఒకటిగా పేర్కొంటారని చెప్పుకున్నాం కదా. ఉత్తరప్రదేశ్‌లో ఈ మధుర ఉంది. ఇక్కడి శ్రీకృష్ణుడి ఆలయం ఈనాటిది కాదు. సుమారు 5000 సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుడి ముని మనవడు వజ్రనాభుడు నిర్మించినట్లుగా చెబుతారు. ఆ తరువాత కాలంలో ఎన్నోసార్లు ఈ ఆలయంపై దండయాత్రలు కొనసాగాయి. క్రీ.పూ. 6వ శతాబ్దం నుంచి మధుర మత, సాంస్కృతిక పరంగా ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ ఆలయానికి సంబంధించిన శాసనాలు దీనికి సంబంధించిన ఎన్నో విషయాలను తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఆలయాన్ని మౌర్య, చంద్రగుప్త రాజులూ పరిపాలించే సమయంలో అనేక కట్టడాలు నిర్మించారని తెలుస్తోంది.

Share this post with your friends