
శివో మహేశ్వరః శంభుః శ్రీ కంఠోభవ ఈశ్వరః మహాదేవః పశుపతిః నీల కంఠుడు,వృష ధ్వజః పరమేశ ఇమే రుద్రా, ఏకాదశ సమీరితా… అనే శివ తత్వ రత్నాకరం. దీనిని బట్టి
1. శివుడు
2. మహేశ్వరుడు
3. శంభుడు
4. శ్రీకంఠుడు
5. భవుడు
6. ఈశ్వరుడు
7. మహాదేవుడు
8. పశుపతి
9. నీలకంఠుడు
10. వృష ధ్వజుడు
11. పరమేశుడు అనువారు ఏకాదశరుద్రులు.
మరో పక్షాన్ని అనుసరించి :
1. అర్జునుడు
2. ఏకాపాదుడు
3.అహిరిభ్యు ధన్న్యుడు
4.త్వష్ట
5. రుద్రుడు
6. అల్లుడు
7. శంభుడు
8. త్ర్యంబకుడు
9. అపరాజితుడు
10. ఈశానుడు
11. త్రిభువనుడు
ఏకాదశ రుద్రులుగా పేర్కొనబడ్డారు. ఇంకా కొన్ని మత భేదాలు ఉన్నాయి. వాటి ప్రకారం పై పేర్లలో కొన్నింటికి బదులు వృషా కపి, కపర్థి, శర్వుడు, మొదలైన పేర్లు వినబడుతున్నాయి. ఇలాగే ద్వాదశాదిత్యులు అన్న విషయంలో కూడా బేధాలు కనబడుతున్నాయి. ఒక మతాన్ని అనుసరించి ఈ క్రింది వారు ద్వాదశాదిత్యులు అవుతారు.
1.దాత
2. మిత్రుడు
3. అర్యముడు
4. శుక్రుడు
5. వరుణుడు
6. అంశుడు.
7. భగుడు
8. వివస్వంతుడు
9. పుముష్షుడు.
10. సవిత
11.త్వష్ట
12. విష్ణువు.
మరొక పక్షంలో వీటిలో కొన్ని పేర్లకు బదులు
1. జయంతుడు.
2. భాస్కరుడు.
3. భానుడు.
4. హిరణ్య గర్బ్డు
5. ఆదిత్య డు.
ఇత్యాదిగా గల నామాలు పేర్కొనబడి ఉన్నాయి.
