పడుకునే విషయంలోనూ కొన్ని నియమాలున్నాయి. తూర్పు దిశవైపు కొందరు తల పెట్టుకుని పడుకుంటారు. మరికొందరు పడమర దిక్కువైపు తల పెట్టి పడుకుంటారు. ఇక కొందరు దిక్కులతో సంబంధం లేకుండా ఎలా పడితే అలా పడుకుంటారు. ఇలా పడుకుంటే ఇబ్బందులు తప్పవట. దీనికి శాస్త్రీయ కారణాలతో పాటు.. పురాణాలు చెప్పే కారణమూ ఉంది. ఉత్తరం వైపు తల పెట్టి పడుకుంటే యమదూతలు వస్తారని.. మృత్యువు సంభవిస్తుందని చెబుతారు. శాస్త్రాల ప్రకారం ఉత్తరం వైపు తలపెట్టుకుంటే పడుకునే వారి తల పోతుందని పురాణాలు చెబుతున్నాయి. అంటే మృత్యువు సంభవిస్తుందని అర్థం.
ఉత్తర, దక్షిణ దిక్కుల్లో పడుకోకూడదని సైన్స్ కూడా చెబుతోంది. ఉత్తరం వైపు పడుకోవడం వల్ల నెగిటివ్ ఎనర్జీ పెరగడమే కాకుండా.. జీవితంలో నష్టాలను కూడా ఎదుర్కొనాల్సి వస్తుందట. ఉత్తర, దక్షిణ దిశల వైపు తల పెట్టుకుని పడుకుంటే.. భూ అయస్కాంత ప్రభావం మనపై ఎక్కువగా ఉంటుందట. తద్వారా ఆ ప్రభావం శరీర అయస్కాంత క్షేత్రంపై పడుతుంది. ఈ క్రమంలో శరీరంలో జరిగే రక్త ప్రసరణలో అనేక హెచ్చుతగ్గులు ఏర్పడతాయట. ఉత్తర దిశ వైపు పడుకుంటే నిద్ర కూడా సరిగా పట్టదట. అలాగే తలనొప్పి, డిస్టర్బ్ నిద్ర వంటివి జరుగుతాయట. వీటన్నింటికీ కారణం శరీరంలో రక్త ప్రసరణ సరిగా జరగకపోవడమేనని సైన్స్ చెబుతోంది.