శివుడిని ఎప్పుడైనా.. ఎక్కడైనా.. దాదాపుగా ఆలయాల్లో సైతం లింగ రూపంలోనే పూజించుకుంటూ ఉంటాం.
గోధుమ లేదా ఇసుక రంగు శివలింగం: గోధుమ రంగు శివలింగాన్ని సాధారణంగా బంకమట్టి లేదా మృదువైన రాయి నుంచి తయారు చేస్తారు. ఈ రంగు ముఖ్యంగా భూమితో అనుబంధాన్ని, స్థిరత్వానికి చిహ్నంగా చెబుతారు. గోధుమ రంగు భూమితో అనుబంధాన్ని కలిగి ఉంటుంది కాబట్టి వెచ్చగా, ఓదార్పునివ్వడమే కాకుండా బలాన్ని తీసుకురావడానికి సైతం సహాయపడుతుంది. గోధుమ రంగు శివలింగాన్ని ముఖ్యంగా కుటుంబ జీవితంలో సమతుల్యత కోరుకునే వారు ఈ రంగును ఎంచుకుంటారు.

ఆకుపచ్చ శివలింగం: ఆకుపచ్చ శివలింగం అనేది చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఆకుపచ్చ శివలింగాన్ని జాడే లేదా ఆకుపచ్చ రాయి నుంచి తయారు చేస్తారు.
ఆకుపచ్చ వర్ణం దేనికి ప్రతీక అనేది తెలిసిందే. ఇది వృద్ధికి ప్రతీకగా చెబుతారు. తాజా శక్తి, మానసికంగా కోలుకోవడానికి ఈ రంగు శివలింగం మద్దతు ఇస్తుంది. ఆకుపచ్చ శివలింగాన్ని ఏదైనా కొత్త ప్రారంభాలకు సహకరిస్తుందని చెబుతారు. అంతేకాకుండా పాత గాయాల నుంచి కోలుకోవాలనుకునే వారు లేదా జీవితంలో కొత్త దశను ప్రారంభించాలనుకునే వారు ఆకుపచ్చ శివలింగాన్ని ఇంటికి తీసుకు వచ్చి పూజించుకుంటారు.
