
రాఖీ పండుగ వచ్చేస్తోంది. ప్రతి సంవత్సరం శ్రవణ మాసం పౌర్ణమి రోజున రాఖీ పండుగను జరుపుకుంటూ ఉంటాం. ఆ లెక్కన చూస్తే ఈ ఏడాది రాఖీ పండుగ ఈ నెల 19న రానుంది. ఇక రాఖీ పండుగ రోజున ఏర్పడే శుభ యోగాల గురించి.. అలాగే భద్ర నీడ గురించి ముందే తెలుసుకున్నాం. ఇక రాశులను బట్టి కూడా రాఖీలు కడతారని తెలుసా? అవును రాశులను బట్టి రంగు ఎంపిక ఉంటుంది. ఇప్పుడు ఏ రాశి వారికి ఏ రంగు రాఖీలో కట్టాలో చూద్దాం.
ఏ రాశి వారికి ఏ రంగు?
మేష రాశి: ఈ రాశి వారికి ఎరుపు రంగు రాఖీని సోదరీమణులు కట్టాలి. ఈ రంగు రాఖీ కట్టడం వలన జాతకంలో కుజుడు బలపడతాడు.
వృషభ రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులకు తెలుపు రంగు రాఖీ కట్టాలి. ఈ రంగు రాఖీ కట్టడం వలన జాతకంలో శుక్రుడు బలపడతాడు.
మిధున రాశి: ఈ రాశి వారికి ఆకుపచ్చ రంగు రాఖీ కట్టాలి. ఈ రంగు రాఖీ కట్టడం వలన జాతకంలో బుధ గ్రహం బలపడుతుంది.
కర్కాటక రాశి: ఈ రాశి వారికి తెలుపు రంగు రాఖీ కట్టాలి. ఈ రంగు రాఖీ కట్టడం వలన జాతకంలో చంద్రుడు బలపడతాడు.
సింహ రాశి: ఈ రాశి వారికి పసుపు లేదా ఎరుపు రంగు రాఖీ కట్టాలి. ఈ రంగు రాఖీ కట్టడం వలన జాతకంలో సూర్యుడు బలపడతాడు.
కన్య రాశి: ఈ రాశి వారికి పచ్చ రంగు రాఖీ కట్టాలి. ఈ రంగు రాఖీ కట్టడం వలన జాతకంలో బుధ గ్రహం బలపడుతుంది.
తులా రాశి: ఈ రాశి వారికి తెలుపు రంగు రాఖీ కట్టాలి. ఈ రంగు రాఖీ కట్టడం వలన జాతకంలో శుక్రుడు, చంద్రుడు బలపడతారు.
వృశ్చిక రాశి: ఈ రాశి వారికి ఎరుపు రంగు రాఖీని కట్టాలి. ఈ రంగు రాఖీ కట్టడం వలన జాతకంలో కుజుడు బలపడతాడు.
ధనుస్సు రాశి: ఈ రాశి వారికి పసుపు రంగు రాఖీని కట్టాలి.ఈ రంగు రాఖీ కట్టడం వలన జాతకంలో కుజుడు బలపడతాడు.
మకర రాశి: ఈ రాశి వారికి నీలం రంగు రాఖీ కట్టాలి. ఈ రంగు రాఖీ కట్టడం వలన జాతకంలో శని బలపడి శుభాలు కలుగుతాయి.
కుంభ రాశి: ఈ రాశి వారికి ఆకాశ నీలి రంగు రాఖీ కట్టాలి. ఈ రంగు రాఖీ కట్టడం వలన జాతకంలో శని బలపడుతుంది.
మీనరాశి: ఈ రాశి వారికి పసుపు రాఖీ కట్టాలి. ఈ రంగు రాఖీ కట్టడం వలన జాతకంలో కుజుడు బలపడతాడు.
