సత్ఫలితాల కోసం జపం ఎక్కడ చేయాలి?

జపం చేయడం వలన సత్ఫలితాలు వస్తాయని అందరికీ తెలిసిందే. అయితే దానిని ఎక్కడ చేయాలనే విషయం మాత్రం చాలా మందికి తెలియదు. అసలు జపం ఎందుకు చేయాలి? ఎక్కడ చేయాలి? వంటి విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం. జపం అనేది జన్మ విచ్ఛేద కారకమని చెబుతారు. అంటే జన్మను విచ్ఛేదం చేస్తుంది. తద్వారా పునర్జన్మ రాకుండా ఉండాలంటే జపం చేయాలి. మరి అంతటి ఫలితం దక్కాలంటే ఎక్కడ పడితే అక్కడ జపం చేస్తే అది సాధ్యం కాదు. మరి అలాంటప్పుడు ఎలాంటి ప్రదేశాలు ఉత్తమమైనవి? ఆ సమయంలో మన మనసు, శరీరం ఎలా ఉండాలి వంటి విషయాలను మీరు కూడా తెలుసుకోండి.

సత్ఫలితాల కోసం జపం ఎక్కడ చేయాలి?
సత్ఫలితాల కోసం జపం ఎక్కడ చేయాలి?

జపం చేయడానికి ఉత్తమమైన ప్రదేశమైతే నదీ తీరంగా చెబుతారు. అక్కడ జపం చేయడం అనేది అందరికీ సాధ్యం కాదు కాబట్టి మరికొన్ని ప్రదేశాలు సైతం జపం చేసేందుకు ఉత్తమమైనవిగానే చెబుతారు. సముద్ర తీరం, కొండ ప్రాంతం, గొప్ప గొప్ప క్షేత్రాలు కూడా జపానికి అనువైన స్థానాలు. ఈ ప్రదేశాలు ప్రశాంతతకు నిలయాలు కాబట్టి ఈ ప్రాంతాల్లో జపం చేస్తే సత్ఫలితాలు ఉంటాయట. అలా కానీ పక్షంలో ఇంట్లోనే ఎలాంటి డిస్టర్బెన్స్ లేని ఏదైనా ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చొని జపం చేస్తే ఉపయోగం ఉంటుందని చెబుతారు. జపం చేసేటప్పుడు మన మనసు, శరీరం రెండూ నిర్మలంగా.. పవిత్రంగా ఉండాలని చెబుతారు. అప్పుడే ఫలితం దక్కుతుంది.

Share this post with your friends