అమ్మవారు స్వయంగా తయారు చేసి పూజించిన శివలింగం ఎక్కడుందంటే..

మనం ఇప్పటికే శివలింగం గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. శివలింగం ఎలా పుట్టింది? శివలింగం ఎన్ని రకాలు.. వేటి వేటి ఆధారంగా శివలింగాలను ఎంచుకుంటాం వంటి విషయాలన్నింటి గురించి తెలుసుకున్నాం. అలాగే ఏ శివలింగాన్ని పూజిస్తే ఎలాంటి ప్రయోజనం కూడా జరుగుతుందో తెలుసుకున్నాం. కొన్ని లింగాలు దేవతలు స్వయంగా తయారు చేసినవి కూడా ఉన్నాయి. ఒక లింగాన్ని అమ్మవారే స్వయంగా తయారు చేసిందని చెబుతారు. మరి ఆ లింగం ఎక్కడుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఎందరో మునులు ఋషులు తపస్సు చేసి ప్రతిష్ట చేసిన లింగాలు ఉన్నాయి ప్రత్యక్షం అయిన లింగాలు ఉన్నాయి. కానీ కంచిలో ఉన్న ఏకంబరేశ్వర లింగం స్వయంగా పార్వతీ అమ్మవారు తయారు చేసి పూజించిన శివలింగం. ఎక్కడైనా అమ్మవారికి దేవ, మానవ పూజలు, ఆధారాలు ఉన్నాయి కానీ… అమ్మవారు పూజించిన శివలింగం ఆధారంతో కంచిలో మాత్రమే ఉంది. తల్లి ఆరాధించిన క్షేత్రం తర్వాతే ఏదైనా. ఆమ్మ కొలిచిన చోట అయ్యవారు ఎంతో ప్రసన్నంగా ఉంటాడు. కోరిన వరాలను ఇచ్చే కొంగు బంగారం ఈ కంచి క్షేత్రం.ఇది గుర్తు పెట్టుకుని ఈ సారి వెళ్ళినప్పుడు స్వామి దర్శనం చేసుకోండి. మనసు, కళ్ళు సంతోషంతో నిండిపోతాయి.

Share this post with your friends