మఖ్వా ఆలయం ఎక్కడుంది? దానిలో ఎవరు కొలువై ఉన్నారు?

భారతదేశంలో హిందూ దేవాలయాలకు కొదువ లేదు. దేశంలో ఎన్నో పురాతన, అద్భుత దేవాలయాలతో పాటు చాలా మిస్టీరియస్ ఆలయాలున్నాయి. అలాంటి ఒక ఆసక్తికర ఆలయం ఉత్తరాఖండ్‌లో ఉంది. ఉత్తరాఖండ్‌లో ముఖ్వా పర్వతాలున్నాయి. దీనిపై అందమైన గ్రామాలున్నాయి. మఖ్వా ఆలయం ఉంది. ముఖ్యంగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తరకాశి జిల్లాలోని హర్షిల్ లోయలో నది ఒడ్డున ముఖ్వా గ్రామం లేదా ముఖిమత్ అని కూడా పిలుస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఆలయంలో పూజలు చేశారు. దీంతో ఈ ఆలయం చర్చనీయాంశంగా మారింది.

అసలు ఈ ఆలయం ఎక్కడుంది? దీని ప్రాముఖ్యత ఏంటో తెలుసుకునేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్వా ఆలయం ఎందుకు అంత ప్రసిద్ధి చెందింది? అసలు ఆ ఆలయంలో ఎవరు కొలువై ఉన్నారు? వంటి విషయాలు తెలుసుకుందాం. వాస్తవానికి ఉత్తరకాశి జిల్లాలోని హర్షిల్ లోయలో నది ఒడ్డున ఉన్న ఈ గ్రామం మాతంగ ఋషికి పుట్టినిల్లు. ఆయన పేరు మీదుగానే ఈ గ్రామానికి మఖ్వా అని పేరు వచ్చిందట. మాతంగ ఋషి తపస్సు చేసి.. గంగాదేవి శీతాకాలంలో ఈ ప్రదేశంలోనే కొలువై ఉండేలా వరం పొందాడట. కాబట్టి ఈ ప్రదేశాన్ని గంగా మాత జన్మభూమి అని కూడా పిలుస్తారు. ఇక్కడ శీతాకాలంలో ఈ గ్రామం గంగా దేవి నివాసంగా ఉంటుందని చెబుతారు.

Share this post with your friends