
పంచ కేదార్ ఆలయాల్లో ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రమైన రుద్రనాథ్ ఆలయం గురించి తెలుసా? ఇది ఉత్తరాఖండ్ కొండలలో ఉంది. శివ భక్తులకు కేదార్‌నాథ్ ధామ్ ప్రధాన విశ్వాస కేంద్రంగా ఉన్నట్టే.. రుద్రనాథ్ ఆలయం కూడా అంతే విశ్వాసాన్ని కలిగి ఉంది. ఈ ఆలయం ఉత్తరాఖండ్ కొండలలో ఉంది. ఈ ఆలయ విశేషం ఏంటంటే.. మహాభారత యుద్ధం తర్వాత పాండవులు ఈ ప్రదేశానికి వచ్చి తమ సొంత సోదరులైన కౌరవులను చంపిన పాపం నుంచి విముక్తి పొందారట. ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ ఆలయ సందర్శనకు రోజుకు 140 మందికి మాత్రమే అనుమతి ఉంటుంది.
సుముద్ర మట్టానికి దాదాపు 3,600 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ఆలయం ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో ఉంది. ఇదొక సహజ రాతి ఆలయం కావడం మరో విశేషం. ఈ ఆలయంలో రోడోడెండ్రాన్ మరుగుజ్జులు, ఆల్పైన్ పచ్చిక బయళ్ల దట్టమైన అడవిలో ఉన్న ఈ ఆలయం పంచ కేదార్లలో నాల్గవ కేదార్‌గా పరిగణించబడుతోంది. ఈ ఆలయానికి పాండవులతో అనుబంధముందని పురాణాలు చెబుతున్నాయి. అసలు పాండవులే మహాభారత కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించారని ప్రతీతి. తమ సోదరులైన కౌరవులను చంపిన పాపం నుంచి విముక్తి పొందేందుకే పాండవులు ఈ ఆలయాన్ని నిర్మించారట.
