
ఇప్పటి వరకూ మనం పంచ ముఖ లింగాల గురించి తెలుసుకున్నాం కదా. అయితే ఆరుముఖాలు గల షణ్ముఖలింగాన్ని పూజించే పద్ధతి ప్రస్తుతం లేదు. అయినా సరే.. అసలు షణ్ముఖ లింగం అంటే ఏమిటి? ఏ ముఖం దేనిని చూస్తుందో తెలుసుకుందాం.
షణ్ముఖ లింగం:
షణ్ముఖ లింగం అత్యంత ఆసక్తికరంగా ఉంటుంది. ఈ లింగంలో నాలుగు ముఖాలు నాలుగు దిక్కులను చూస్తుండగా, ఐదవ ముఖం ఆకాశాన్నీ, ఆరవ ముఖం పాతాళాన్ని చూస్తుంటాయి. ఈ ఆరు ముఖాల నుంచి వెలువడిన తేజఃపుంజాలతో శివుడు సుబ్రహ్మణ్య స్వామిని సృజించాడని పురాణకథనం. అలాగే పాలసముద్రాన్ని మధించినప్పు డు వెలువడిన హాలాహలాన్ని పరమేశ్వరుడు అథోముఖంతో స్వీకరించాడట. అయితే ప్రస్తుతం ఎక్కడా మనం షణ్ముఖ లింగాన్ని దర్శించుకోలేము.ఇక ఎవరెవరు ఏయే లింగాన్ని పూజిస్తే ఫలితం ఉంటుందున్న విషయాన్ని కూడా మన పురాణాలు పేర్కొన్నాయి.
బ్రహ్మవేత్తలు రసలింగాన్ని, క్షత్రియులు బాణలింగాన్ని, వ్యాపారస్తులు స్వర్ణలింగాన్ని, ఇతరులు శిలా లింగాన్ని పూజించాలి. వితంతువులు స్ఫటికలింగాన్ని లేక రసలిం గాన్ని అర్చిస్తే మంచిది. ఈ స్ఫటికలింగాన్ని అందరూ పూజించవచ్చు. ఏ లింగాన్ని పూజించడం వల్ల ఫలితమన్న విషయాన్ని లింగపురాణం వివరించింది.
