
లవకుశలతో పాటు భరతుడు సహా పలువురు పురాణ పురుషులు నిర్మించిన నగరాలు ఎక్కడ ఉన్నాయి? ఏ దేశంలో ఉన్నాయో ముందుగా తెలుసుకుందాం.
కుశపురం (సీతారాముల పెద్ద కుమారుడు కుశుడు కట్టించిన నగరం) – కుశార్, పాకిస్తాన్
లవపురం (సీతారాముల చిన్న కుమారుడు లవుడు కట్టించిన నగరం) – లాహోర్, పాకిస్తాన్
తక్షశిల (శ్రీరాముని తమ్ముడైన భరతుని పెద్దకొడుకు తక్షుడు నిర్మించిన నగరం) – తక్షశిల, పాకిస్తాన్
పుష్కలావతి / పురుషపురం (శ్రీరాముని తమ్ముడైన భరతుని రెండవ కొడుకు పుష్కరుడు నిర్మించిన నగరం) – పెషావర్, పాకిస్తాన్
భాగవతం, మహాభారతం మహావిష్ణువు గజేంద్రున్ని మొసలి బారి నుంచి రక్షించిన స్థలం – దేవ్ ధాం,నేపాల్
నృసింహస్వామి హిరణ్యకశిపుని వధించిన స్థలం – అహోబిలం,ఆంధ్రప్రదేశ్
జమదగ్ని మహర్షి ఆశ్రమం – జమానియా, ఉత్తర్ ప్రదేశ్
మహీష్మతి (కార్తవీర్యార్జునుని రాజధాని) -మహేశ్వర్,మధ్యప్రదేశ్
శమంతక పంచక (పరశురాముడు ఇరవైయొక్క మార్లు క్షత్రియులపై దండెత్తి వారి రక్తంతో 5 మడుగులు నెలకొల్పిన చోటు),కురుక్షేత్రం,
దుర్యోధనుని చంపిన చోటు-కురుక్షేత్ర, హర్యానా
పరశురామక్షేత్రం (పరశురాముడు తన గొడ్డలిని సముద్రంలోకి విసిరి,సముద్రజలాలను వెనక్కి పంపి తనకోసం నేలను సృష్టించుకొన్న ప్రాంతం) – కేరళ,కర్ణాటక,మహరాష్ట్ర సముద్రతీర ప్రాంతం
మహేంద్ర పర్వతం (పరశురాముడు తపస్సు చేసిన స్థలం) – పశ్చిమ ఒరిస్సా
నిషాద రాజ్యం (నల మహారాజు రాజ్యం) – గ్వాలియర్ జిల్లా,మధ్యప్రదేశ్
వ్యాస మహర్షి పుట్టిన స్థలం- ధమౌలి, నేపాల్
నైమిశారణ్యం (వ్యాస మహర్షి తన శిష్యులకు వేదాలు,పురాణాలు బోధించిన ప్రాంతం) – సీతాపూర్ జిల్లా, ఉత్తర్ ప్రదేశ్
వ్యాస మహర్షి చెబుతుండగా, విఘ్నేశ్వరుడు మహాభారతం వ్రాసిన చోటు- మన గ్రామం, ఉత్తరాంచల్
రతిష్టానపురం (పురూరవుని రాజధాని) -ఝున్సి,అలహాబాద్
సాళ్వ రాజ్యం(సావిత్రీ,సత్యవంతుల కథలో సత్యవంతుని రాజ్యం)-కురుక్షేత్ర దగ్గర
హస్తినాపురం (కౌరవుల రాజధాని) – హస్తినాపూర్, ఉత్తర్ ప్రదేశ్
మధుపురం / మధువనం (కంసుని రాజధాని) -మధుర, ఉత్తర్ ప్రదేశ్
వ్రేపల్లె / గోకులం – గోకుల్, మధుర దగ్గర
కుంతిపురి (పాండురాజు మొదటి భార్య కుంతిదేవి పుట్టినిల్లు)
