
మకర సంక్రాంతి హిందువులకు అతి పెద్ద పండుగ. తెలుగు రాష్ట్రాల్లో అయితే ఏపీలో ఈ పండుగను పెద్ద ఎత్తున నిర్వహిస్తారు. ఈ పండుగను ప్రతి ఏటా జనవరి మాసంలో 14 లేదంటే 15న నిర్వహించుకుంటాం. అయితే ఈ ఏడాది ఎప్పుడు నిర్వహించుకుంటాం? ఈ పండుగను ప్రతి ఏటా సూర్యుడు మకరరాశిలో ప్రవేశించినప్పుడు ఈ పండుగను జరుపుకుంటాం. ఈ సమయంలో పంట ఇంటికి చేరుకోవడంతో కుటుంబమంతా ఆనందోత్సాహాల మధ్య జరుపుకుంటుంది. మరి తెలుగు రాష్ట్రాలు అత్యంత ప్రాధాన్యతనిచ్చే మకర సంక్రాంతి ఈ ఏడాది ఎప్పుడో తెలుసుకుందాం.
మకర సంక్రాంతిని 2025 జనవరి 14 మంగళవారం జరుపుకోవాలి. వేదక్యాలెండర్ ప్రకారం 14వ తేదీన ఉదయం 9.03 గంటలకు సూర్యభగవానుడు మకరరాశిలోకి ప్రవేశిస్తాడు కాబట్టి ఈ రోజునే జరపుకుంటాం. ఈ పండుగకు భోగి, కనుమ కూడా ఉంటాయి. భోగి పండగను జనవరి 13వ తేదీన, కనుమ పండగను జనవరి 15న జరుపుకుంటాం. 14వ తేదీన శుభ సమయం వచ్చేసి ఉదయం 9.03 గంటల నుంచి సాయంత్రం 05.46 గంటల వరకు ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో గంగాస్నానం, దానం చేయడం వంటివి సత్ఫలితాలను ఇస్తాయట. అలాగే మకర సంక్రాంతి మహా పుణ్యకాల సమయం ఉదయం 9.03 గంటల నుంచి 10.48 గంటల వరకు ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రెండు సమయాలూ గంగాస్నానానికి, దానాలకు శుభ సమయం.
