గంగా సప్తమి ఎప్పుడు? ఆ రోజున ఏం చేయాలి?

గంగాసప్తమి అంటే గంగాదేవి జన్మదినాన్నే గంగాసప్తమిగా జరుపుకుంటూ ఉంటాం. ఇదే రోజున గంగమ్మ బ్రహ్మ దేవుని కమండలం నుంచి ఉద్భవించిందట. కాబట్టి ఈ రోజుకు అత్యంత ప్రాధాన్యం ఉంది. ఈ రోజున గంగమ్మను పూజిస్తే చేసిన పాపాలన్నీ తొలగిపోతాయట. ఇక పెళ్లి కాని అమ్మాయిలకైతే తగిన వరుడు లభిస్తాడట. అసలు ఈ పండుగ ఎప్పుడు వస్తుంది? పూజ ఎలా చేయాలో చూద్దాం. ప్రతి సంవత్సరం వైశాఖ మాసం శుక్లపక్షంలో ఏడవ రోజున ఈ పండుగ వస్తుంది. ఇక ఈ ఏడాది ఎప్పుడు అంటారా? ఈ నెల మే 14న వస్తుంది. మే 13న సాయంత్రం 5:20 గంటలకు సప్తమి తిథి ప్రారంభమై మే 14న సాయంత్రం 6:49 గంటలకు ముగుస్తుంది.కాబ్టి మే 14న జరుపుకుంటాం.

ఉదయాన్నే లేచి శుచిగా స్నానం చేసి గంగమ్మకు పూల మాలతో పాటు ఇంట్లో తయారు చేసిన నైవేద్యాన్ని సమర్పించాలి. ఆ తరువాత గంగాదేవికి హారతి ఇవ్వాలి. ‘ఓం నమో గంగాయై విశ్వరూపిణీ నారాయణి నమో నమః గంగా గంగా’ అనే మంత్రాన్ని పఠిస్తే పుణ్యలోకం ప్రాప్తిస్తుందని నమ్మకం. గంగా సహస్ర నామ స్తోత్రంతో పాటు గాయత్రీ మంత్రాన్ని సైతం పఠిస్తూ ఉంటారు. అలాగే ఈ రోజు శివుడిని సైతం పూజిస్తారు. గంగానది ఒడ్డున అయితే పెద్ద ఎత్తున వివిధ కార్యక్రమాలు జరుగుతాయి. ఈ రోజున గంగానదిలో స్నానం చేస్తే సర్వ పాపాలు హరిస్తాయని నమ్మకం.

Share this post with your friends