బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం ఎప్పుడు జరగనుందంటే..

ఈ ఏడాది ఆషాఢ మాసం జూలై 6న ప్రారంభం కానుంది. ఈ నెలలో చాలా ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగనున్నాయి. హిందువుల పండగలు మొదలయ్యే తొలి ఏకాదశి, గురు పూర్ణిమ, చాతుర్మాస్ వ్రతంలతో పాటు తెలంగాణలో ప్రసిద్ధి చెందిన బోనాలు పండుగ వంటివన్నీ ఈ మాసంలోనే జరగనున్నాయి. అంతేకాకుండా ఈ మాసంలో మరో మహత్తర కార్యక్రమం కూడా జరగనుంది. అదే బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం. హిందూ తెలుగు చాంద్రమానం ప్రకారం బల్కం పేట ఎల్లమ్మ కళ్యాణం ఆషాడ మాసం మొదటి మంగళవారం ఎల్లమ్మ కల్యాణోత్సవం వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. మరి ఆ రోజు ఎప్పుడొస్తుంది అంటారా?

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోని ప్రసిద్ధ బల్కంపేట్ ఎల్లమ్మ ఆలయంలో అంగరంగ వైభవంగా ప్రతి ఏటా కల్యాణం జరుగుతూ ఉంటుంది. ఇక ఈ ఏడాది జూలై 9న ఈ కల్యాణోత్సవాన్ని నిర్వహించనున్నారు. మర్నాడు అంటే 2024 తేదీ జూలై 10న రథోత్సవాన్ని జరపనున్నారు. ఇక్కడి ఎల్లమ్మ తల్లి పిలిస్తే చాలు పలుకుతుందట. ఇక్కడ ఎల్లమ్మ దేవికి మరో రెండు పేర్లు కూడా ఉన్నాయి. రేణుకా దేవి, జల దుర్గా అని కూడా పిలుస్తారు. ఎందుకంటే అమ్మవారి విగ్రహం దాదాపు 10 అడుగులు భూమి కింద నీటిలో శయన స్థితిలో ఉంటుంది. ఇక ఎల్లమ్మ తల్లి వివాహాన్ని మహాదేవ శివయ్యతో జరిపిస్తారు. కల్యాణానంతరం ఇచ్చే తీర్థప్రసాదాలు స్వీకరిస్తే అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిస్తుందని నమ్మకం.

Share this post with your friends