ఉదయం లేవగానే దీన్ని చూస్తే మన దశ తిరిగినట్టే..

ఉదయాన్ని కళ్లు తెరుస్తూనే భగవంతున్ని స్మరించుకుంటే నిద్రలేవడం చాలా మందికి అలవాటు. అలా చేస్తే రోజంతా ప్రశాంతంగా ఉంటుందని భావన. అయితే మనం కళ్లు తెరిచిన వెంటనే మనం చూసే వస్తువులను బట్టి కూడా మన రోజు ఉంటుందట. తెల్లవారుజామున నిద్రలేచిన వెంటనే ఇంటి గుమ్మం వద్ద ఆవు కనిపిస్తే అది శుభసూచకమని పెద్దలు చెబుతారు. కానీ ఇప్పుడు పల్లెటూళ్లలోనే సరిగా గోవులు కనిపించడం లేదు. సిటీలో ఎక్కడ? కాబట్టి ఇంకేదైనా చూస్తే మంచి జరుగుతుందా? అంటే అవును. పల్లెటూరు, నగరంతో సంబంధం లేకుండా ఎక్కడైనా సరే ఉండే బల్లిని చూస్తే మనకు శుభం కలుగుతుందట.

ఉదయం నిద్రలేచిన వెంటనే బల్లిని చూస్తే అదృష్టం పడుతుందట. కళ్ళు తెరిచిన వెంటనే బల్లిని చూడటం చాలా మంచిదట. ఇలా ఉదయం లేవగానే బల్లిని చూస్తే మనకు జీవితంలో మంచి జరుగుతుందట. ఇక బల్లి కూడా సాధారణమైనది కాదు.. ఉదయం పూట గోడపై పాకుతూ ఉండే బల్లిని చూడాలట. ఇలా చూస్తే మనం జీవితంలోనూ ఇక్కో మెట్టు ఎక్కుతూ పైకి వెళతామట. నిజానికి బల్లిని సంపదకు చిహ్నంగా పరిగణిస్తూ ఉంటారు. కాబట్టి తెల్లవారుజామున బల్లిని చూస్తే ఆర్థికంగా బాగా కలిసొస్తుందట. అకస్మాత్తుగా మన తలపై బల్లి పడితే అది శుభ శనుకమట. ఇలా జరిగితే సమాజంలో వ్యక్తి గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయట.

Share this post with your friends