సాయిబాబా వ్రతం ఎప్పుడు చేయాలి? ఎలా చేయాలి?

గురువారం సాయినాథునికి అంకితమైన రోజు. ఈ రోజున సాయిబాబా వ్రతాన్ని ఆచరిస్తే చాలా మంచి జరుగుతుందట. అసంపూర్తిగా ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. అనారోగ్య సమస్యలు, ఆర్థిక బాధలు ఉండవని చెబుతారు. అయితే మరి ఈ వ్రతాన్ని ఎలా చేయాలి? ఎన్ని రోజుల పాటు చేయాలి? వంటి అంశాలు చూద్దాం. ఈ వ్రతాన్ని గురువారం రోజున నిర్వహించాలి కానీ ఫలానా గురువారం అని లేదు. ఇక మీరు ఈ వ్రతాన్ని ఆచరించే గురువారం పౌర్ణమి అయితే మరీ మంచిది. అన్ని వ్రతాల మాదిరిగానే 5, 7, 9, లేదా 11 వారాలు చేయాలి. ఇక ఎన్ని వారాల పాటు చేయాలనేది మీ ఇష్టం.

సాయిబాబాను పూజించడం పెద్ద కష్టమేమీ కాదు. ఇతర దేవుళ్ల మాదిరిగా సాయిబాబు వ్రతం ఆచరించేందుకు భారీ నియమ నిబంధనలేమీ ఉండవు. బ్రహ్మ ముహూర్తాన లేచి తలస్నానం చేసి పసుపు రంగు వస్త్రాలు ధరించాలి. సాయిబాబా పటంతో పాటు పూజ గదిని శుభ్రం చేసి నెయ్యి దీపం వెలిగించాలి. అనంతరం సాయిబాబాకు పూజ చెయ్యాలి. అనంతరం బాబావారి ఉపవాస కథను చదివాలి. తరువాత బాబాకు పసుపు రంగులో ఉండే నిమ్మకాయ పులిహోర, లడ్డు, పండ్లను నైవేద్యంగా సమర్పించాలి. అనంతరం హారతి ఇవ్వాలి. ఇక సాయంకాలం ఏదైనా సాయిబాబా ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకున్న అనంతరం ఉపవాస దీక్షను విరమించాలి.

Share this post with your friends