కోడికూత, రోకలి పోటు వినలేనని శివయ్య చెప్పడంతో..

ఏలూరు జిల్లాలోని కలిదిండికి మూడు మైళ్ల దూరంలో ఉన్న పాతాళ భోగేశ్వరాలయం గురించి మనం ఇప్పటికే తెలుసుకున్ానం. ఈ ఆలయం ఎంతో ప్రాచీన చరిత్ర కలిగింది. ఈ ఆలయ స్థల పురాణం అత్యంత ఆసక్తికరంగా ఉంటుంది. ఈ ఆలయం కలిదిండికి తూర్పు ఆగ్నేయంలో నిర్మించబడింది. ఈ ఆలయ స్థల పురాణం ఏంటంటే.. రాజ రాజ చోళుడి కుమారుడు రాజరాజ నరేంద్రుని కాలంలో ఒక రైతు నాగలితో పొలం దున్నుతున్నాడట. ఆ సమయంలో భూమిలో నాగలి కర్రుకు లింగాకారంలో ఉన్న శిల తగిలిందట. నాగలి కర్రు తగలడంతో కొంత భాగం అది విరిగి అక్కడి నుంచి రక్తం వరదలా పారింది.

స్థానికులకు విషయం తెలిసిందే. ఆ పరమశివుడే అక్కడ స్వయంభువుగా కొలువయ్యాడని నమ్మి విగ్రహాన్ని బయటకు తీశారట. విరిగిన భాగాన్ని అతికించారట. ఆ అతుకు ఇప్పటికీ మనకు స్పష్టంగా తెలుస్తుంది. అంతేకాక అతికించిన భాగం నుంచి చమరిస్తున్నట్లుగా భక్తులకు కనిపిస్తుంది. వాస్తవానికి విగ్రహం పొలాల మధ్యన దొరికిందట. గ్రామంలోకి తీసుకొచ్చేందుకు ఎంత యత్నించినా సాధ్యం కాలేదట. తాను కోడి కూత, రోకటిపోటు వినలేనని.. ఆలయాన్ని విగ్రహం దొరికిన చోటే నిర్మించాలని స్వామివారు ఓ భక్తునికి కలలో కనిపించి కోరడంతో అక్కడే నిర్మించారట.

Share this post with your friends